
మధ్యప్రదేశ్‌లోని జహాజ్ మహాల్ వద్ద హిల్లరీ క్లింటన్
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్నారు.
ఇండోర్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆమె మధ్యప్రదేశ్‌లోని మాండవ్ జిల్లా, ధార్‌లోని జహాజ్ మహాల్‌ను ఆమె సందర్శించారు.
ప్రైవేటు విమానంలో ఇండోర్‌కు చేరుకున్న హిల్లరీ.. ఖర్‌గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్‌లో బస చేశారు. పర్యటనలో భాగంగా నర్మదా నదిలో హిల్లరీ బోటింగ్‌కు వెళ్లనున్నారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహేశ్వరీ చీరల మ్యూజియంను ఆమె సందర్శించనున్నారు.
#MadhyaPradesh: Hillary Clinton visited Jahaz Mahal in Dhar's Mandu. She is on a visit to the state from 11-13 March. pic.twitter.com/oXQoC0hesy
— ANI (@ANI) March 12, 2018