
ఇంట్లోంచి బయటకు రాకూడదనుకున్నా: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక అసలు ఇంటి నుంచి బయటకు రావాలనుకోలేదని, మంచి పుస్తకం చదువుతూ గడపాలని భావించానని హిల్లరీ క్లింటన్ చెప్పారు. హోరాహోరీ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓటమిపాలవ్వడం చాలా నిరాశకు గురిచేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆమె ప్రజలతో నేరుగా సంభాషించారు.
బుధవారం బాలల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓటమిపై తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.వారం రోజులుగా ఎంతో మథనపడ్డానని, మంచి పుస్తకాలు చదవాలని, కుక్క పిల్లలతో ఆడుకోవాలనుకున్నానని, ఇంటి నుంచి ఇంకెప్పుడూ అడుగు బయటపెట్టకూడదని అనుకున్నానని చెప్పారు.