పోలింగ్ ప్రారంభం.. రేపే ఫలితాలు!
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది.
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజాము వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ వెంటనే.. అంటే ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా తొలి ఫలితాలు వెల్లడవుతాయి. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి మాత్రం సాయంత్రం అవుతుంది.
అధ్యక్ష పదవి చేపట్టాలంటే కావల్సిన 270 ఎలొక్టరల్ ఓట్లు వచ్చిన వెంటనే గెలిచినట్లు నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల లెక్కింపు జరుగుతుంది. ఈ మెయిళ్ల వ్యవహారంలో చిట్టచివరి నిమిషంలో ఊరట లభించడంతో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌కు విజయావకాశాలు పెరిగాయి. ఒక సర్వే ప్రకారం, ఆమె విజయం సాధించేందుకు 90 శాతం అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా పోటాపోటీగా ముందుకొచ్చారు.