ట్రంప్‌.. ఒరాంగ్ ఉటాన్ కాదు | Trump is Not An Orangeutan | Sakshi
Sakshi News home page

ట్రంప్‌.. ఒరాంగ్ ఉటాన్ కాదు

Published Fri, Nov 11 2016 5:24 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ట్రంప్‌.. ఒరాంగ్ ఉటాన్ కాదు - Sakshi

ట్రంప్‌.. ఒరాంగ్ ఉటాన్ కాదు

(సాధన శీలం, అమెరికా)

నేను భారత్‌లో జూనియర్‌ కాలేజీలో చదివేటపుడు ఆర్కే నారాయణ్‌ ది గైడ్‌ పుస్తకాన్ని చదివాను. ఈ పుస్తకంలోని సారాంశం ఏంటంటే.. కొన్ని పరిస్థితుల కారణంగా ఓ మోసగాడు స్వామిజీగా మారుతాడు. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికాలో ఇదే జరిగింది.

అమెరికాలో కోట్లాదిమంది ప్రజలు, అమెరికా ఓటర్లలో దాదాపు సగంమంది రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నవంబర్‌ 8న అమెరికా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. విజయానంతరం ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రసంగించారు. లక్షాదికారులు, కోటీశ్వరులు దేన్నయినా సాధ్యం చేయగలరా? ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళ అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల నెరవేరలేదు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ మద్దతుదారుగా నాకు బాధకలిగించింది.

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ బరిలో నిలిచాక ప్రపంచమంతా ఆయనపై దృష్టిసారించింది. ట్రంప్‌, ఆయన భార్య మెలానియా తీరును గమనించింది. ట్రంప్‌ విజయం కోసం ఆయన మద్దతుదారులు తీవ్రంగా పనిచేశారు. ఎన్నికల ర్యాలీలలో ట్రంప్‌ ముఖ్యంగా కొన్ని విషయాలే చెబుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. హిల్లరీ మద్దతుదారుగా నేను ఎంతో ఉత్సాహంతో పనిచేశాను.  కానీ ఓట్లను ఆకర్షించలేకపోయాం. ట్రంప్‌కు దీటుగా హిల్లరీ ప్రచారం చేశారు. డిబేట్లలో ఆమె పైచేయి సాధించారు. చివరి డిబేట్‌లో కూడా హిల్లరీ తన తెలివితేటలు, వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. ఎన్నికల రోజు వరకు హిల్లరీయే ముందంజలో నిలిచారు.

ఓ ఇంటర్వ్యూలో హిల్లరీ స్పందించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ట్రంప్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు హిల్లరీ సమాధానమిస్తూ.. ట్రంప్‌ కుటుంబంలో ఆయన పిల్లలు తనకు ఇష్టమని చెప్పారు. ట్రంప్‌ హిల్లరీ గురించి మాట్లాడుతూ.. ఆమె పట్టుదలను ప్రశంసించారు. పోలింగ్‌కు ముందు ముందంజలో ఉన్న హిల్లరీ ఎన్నికల్లో ఓడిపోగా, ట్రంప్‌ అనూహ్యంగా గెలిచారు. నేను చాలా ఏళ్ల క్రితం చదివిన ది గైడ్‌ పుస్తకంలో మాదిరిగా ట్రంప్‌ స్థానిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. మెలే, ఇండోనేసియన్‌ పదాల నుంచి ఒరాంగ్ ఉటాన్ వచ్చింది. ఒరాంగ్‌ అంటే మనిషి, ఉటాన్‌ అంటే అడవి. ‌కాబట్టి ఒరాంగ్ ఉటాన్ అంటే అడవిలోని మనిషి అని అర్థం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement