ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే! | indian astrologer predict on us presidential elections, says hillary will win | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే!

Published Thu, Oct 13 2016 8:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే! - Sakshi

ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తోందట. మిగిలిన గ్రహగతులు కూడా రాజకీయ విజయాన్ని సూచించడం లేదని.. అందువల్ల ఈసారి ఎన్నికల్లో విజేత హిల్లరీ క్లింటనే అవుతారని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ జోస్యం చెప్పారు. ట్రంప్‌, హిల్లరీల పుట్టిన రోజుల ఆధారంగా వాళ్ల జాతకచక్రాలను రూపొందించిన ఆయన.. పలు విషయాలు వెల్లడించారు. ట్రంప్ జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని తెలిపారు.

ఇక హిల్లరీ క్లింటన్‌ది పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదమని, ఆమె కుంభరాశిలో జన్మించారని వివరించారు. ఆమె జన్మలగ్నం తులా లగ్నమని, ప్రస్తుతం రవి మహర్దశలో రాహువు అంతర్దశ నడుస్తోందని తెలిపారు. రవి నీచభంగ రాజయోగంలో ఉన్నాడని, రాహువు ఉచ్చస్థితిలో ఉన్నాడని.. దశమ స్థానంలో శని, కుజులున్నారని చెప్పారు. ఇది చాలా మంచిదని, జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయమని అన్నారు. తొలిసారిగా ఒక మహిళ అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే పరిస్థితి కూడా ఉందని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement