హిల్లరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు | Trump hints Clinton was drugged in last debate | Sakshi
Sakshi News home page

హిల్లరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Published Sun, Oct 16 2016 9:40 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

హిల్లరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Sakshi

హిల్లరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన రెండో ముఖాముఖి చర్చకు ముందు హిల్లరీ డ్రగ్స్ తీసుకున్నారని ట్రంప్ ఆరోపించారు. చివరి, మూడో ముఖాముఖి చర్చకు ముందు హిల్లరీకి, తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

'అథ్లెట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మాకు (హిల్లరీ, ట్రంప్) కూడా ముఖాముఖి చర్చకు ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి. ఆమె ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. గత చర్చలో ఆమె మొదట్లో రెచ్చగొట్టేలా మాట్లాడారు. చివర్లో కారు దగ్గరకు ఉడాయించారు' అని న్యూ హాంప్షైర్లో శనివారం జరిగిన ర్యాలీలో ట్రంప్ చెప్పారు. తాను డ్రగ్ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, హిల్లరీ కూడా సిద్ధం కావాలని సవాల్ విసిరారు. హిల్లరీ ఆరోగ్యంపై ట్రంప్ పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిల్లరీకి మతిమరుపు ఉందని, ఏ విషయం కూడా గుర్తు ఉండదని ఆమే స్వయంగా చెప్పారని ట్రంప్ అన్నారు. కాగా ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సహా పలు విమర్శలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement