'ఆమెను జైలుకు పంపను'
హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ క్యాంపెన్ మేనేజర్ కెల్యాన్నే కాన్వే స్వయంగా ఈ విషయాన్ని ఓ అమెరికన్ చానెల్ కు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ-మెయిళ్ల కేసులో హిల్లరీని జైలుకు పంపాలంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగించాయి.
ఓటమి బాధతో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు ట్రంప్ సాయం చేస్తారని చెప్పారు. అధ్యక్షపదవిని అందుకోబోయే ముందు అన్ని విధాల ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ లేవనెత్తిన సమస్యలు ఇప్పుడు ఆయన అజెండా లేవని చెప్పారు.