
కొనసాగుతున్న హిల్లరీ హవా
అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారని తాజాగా తెలిపిన మరో పోల్ సర్వే తెలిపింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారని తాజాగా తెలిపిన మరో పోల్ సర్వే తెలిపింది. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ నాలుగు పాయింట్లు ముందున్నారని పబ్లిక్ పాలసీ పోలింగ్ ఇన్ స్టిట్యూట్ (పీపీపీ) పేర్కొంది.
టెలిఫోన్, ఆన్ లైన్ ఇంటర్వ్యూలు ద్వారా పోల్ సర్వే నిర్వహించగా హిల్లరీకి 44శాతం మంది మద్దతు తెలపగా.. డోనాల్డ్ ట్రంప్ కు 40శాతం మంది మద్దతు తెలిపారు. అమెరికాలో ప్రతి రోజూ ఏదో ఒక సర్వే వెల్లడవుతూనే ఉంటుంది. మారిపోతున్న పరిణామాలకనుగుణంగా సర్వే ఫలితాలు కూడా మారిపోతుంటాయి. తొలిసారి జరిగిన ప్రెసిడెన్షియల్ బిగ్ డిబేట్ అనంతరం ట్రంప్ కంటే ముందుపడిన హిల్లరీ ప్రస్తుతం అదే హవాను కొనసాగిస్తున్నారు.