వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త మలుపులు తిరిగాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉండగా.. హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని అయిన కాన్యే అధ్యక్ష పదవి రేసులో పాల్గొననున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం వెల్లడించారు. "నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. దేవున్మి విశ్వసిస్తూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలను నెరవేర్చుకుందాం" అని రాసుకొచ్చారు. దీంతో ఆయన ట్రంప్, జో డిబేలకు ప్రత్యర్థిగా గట్టి పోటీనివ్వనున్నారు. తన పోటీకి సంబంధించి క్యానే ఎన్నికల బ్యాలెట్‌కు ఏదైనా పత్రాలను దాఖలు చేశారా అనే విషయం తెలియరాలేదు. (రాయని డైరీ : జో బైడెన్ (ట్రంప్ ప్రత్యర్థి))
కాగా 2018లో ట్రంప్ ఎన్నిక తర్వాత వెస్ట్ తన భార్య, పాపులర్ మోడల్ కిమ్ కర్దాషియాన్‌తో కలిసి ఓ సారి వైట్ హౌస్‌ను సైతం సందర్శించారు. మరోవైపు ప్రముఖ టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కాన్యే ఎన్నికల్లో పాల్గొనడంపై ఆసక్తి కనబర్చారు. కాన్యే ఎన్నికల్లో పోటీ చేస్తే తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించడం కొత్త చర్చను లేవనెత్తింది. మరోవైపు ట్రంప్ తన పీఠాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే దిశగా వరాలు కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ట్రంప్ ఏడాది పాటు రద్దు చేసిన హెచ్-1 బీ వీసాల నిషేధాన్ని ఎత్తివేస్తామని తెలిపారు. (భార్యకు కళ్లుచెదిరే గిఫ్ట్ ఇచ్చిన ర్యాపర్)
Comments
Please login to add a commentAdd a comment