
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన గాల్లప్ పోల్‌లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం 38 శాతం మాత్రమే అంగీకరిస్తున్నట్లు పోల్‌లో వెల్లడయ్యింది.
ఇదే సమయంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. బైడెన్ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించకపోవడం గమనార్హం. వయసుతో పాటు మెక్సికోతో బోర్డర్ వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.
మరోవైపు ట్రంప్ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్‌తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే గతంలో గాలప్ పోల్స్ అంచనాలు చాలాసార్లు మిస్సయ్యాయి.