అమెరికా ఎన్నికలు: జో బైడెన్‌ వార్నింగ్‌ | Joe Biden Warning To Countries Which Interferes In American Elections | Sakshi
Sakshi News home page

కీలక దశకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

Published Fri, Oct 23 2020 8:08 AM | Last Updated on Fri, Oct 23 2020 10:26 AM

Joe Biden Warning To Countries Which Interferes In American Elections - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌- డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో  బైడెన్‌ల మధ్య గురువారం తుది ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ నడిచింది. ఈ ముఖాముఖి సందర్భంగా జో  బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో కలుగజేసుకునే దేశాలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘‘నేను స్పష్టంగా చెబుతున్నాను. అమెరికా ఎన్నికల విషయంలో కలుగజేసుకునే ఏ దేశమైనా కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటివరకు నేను ఏ దేశం నుంచి కూడా ఒక్క పెన్నీ కూడా తీసుకోలేదు. రష్యా, చైనా సహా అనేక దేశాల్లో ట్రంప్‌కు వ్యాపారాలు ఉన్నాయి. రష్యా, చైనా నుంచి ట్రంప్‌కు భారీగా ఆర్థిక సాయం అందుతోంది. చైనాలో ట్రంప్‌కు రహస్య ఖాతాలు ఉన్నాయ’’ని ఆరోపించారు. ( ట్రంప్‌ గెలుస్తాడంటున్న జ్యోతిష్కులు )

రష్యానుంచి బిడెన్‌కు ఆర్థిక సాయం: ట్రంప్‌
‘‘రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతోంది. కరోనాకు కారణం చైనానే. అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గింది. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అమెరికా ముందంజలో ఉంది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నా. కొన్ని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తా’’మన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement