దేశంలోనే అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ విద్యార్థిదశలో తన అడ్మిషన్ దరఖాస్తును తిరస్కరించిన కాలేజీలోనే ఇటీవల ఉపన్యాసం ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముంబయిలోని జై హింద్ కాలేజీ గౌతమ్ అదానీను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా అదానీని పరిచయం చేసే క్రమంలో కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్ నాంకనీ ఆసక్తికర విషయాలు తెలిపారు.
‘1977-78 సంవత్సరంలో గౌతమ్ అదానీ తన పదహారో ఏటా జై హింద్ కాలేజీలో చదివేందుకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే తన సోదరుడు ఈ కాలేజీలో చదవగా తాను ఇక్కడే చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కాలేజీ తన అడ్మిషన్‌ను తిరస్కరించింది. దాంతో అదే సంవత్సరం ముంబయిలో డైమండ్ సార్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీలోనే ఉపన్యాసం ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు’ అని విక్రమ్ నాంకనీ వెల్లడించారు.
కాలేజీ నుంచి వెళ్లిన అదానీ వ్యాపారంలో ఎదిగి ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18.26 లక్షల కోట్లు) సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఇటీవల హురున్ ఇండియా ప్రకటించిన దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేశ్ అంబానీను వెనక్కినెట్టి మొదటి స్థానంలోకి చేరుకున్నారు.
అదానీ వ్యాపార సామ్రాజ్యం
ఎనర్జీ అండ్ యూటిలిటీస్ రంగంలో..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
అదానీ పవర్ లిమిటెడ్
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
రవాణా అండ్ లాజిస్టిక్స్ రంగంలో..
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్
అదానీ ఎయిర్‌పోర్ట్స్
సహజ వనరుల విభాగంలో..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
ఇతర రంగాలు
అదానీ విల్మార్ లిమిటెడ్
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్
అదానీ వాటర్
అదానీ రోడ్, మెట్రో అండ్ రైల్
అదానీ డేటా సెంటర్స్
Comments
Please login to add a commentAdd a comment