
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు రాజకీయ, వ్యాపార వర్గాల, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు.
ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు మెరిసారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, భార్య మీరాతో కలిసి షాహిద్ కపూర్ రాజ్‌పుత్ ఉన్నారు.
ఇంకా దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటతోపాటు శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనం కపూర్, అలియాభట్, కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా, జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్‌తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్‌బీఐ మాజీ మాజీ చీఫ్ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కొత్త శకానికి నాంది: అంబానీ
నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన ముఖేశ్ అంబానీ స్పందిస్తూ ఇది భావి భారతానికి కళలు , సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్‌ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. గ్రాండ్ లాంచ్‌కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Priyanka Chopra and Nick Jonas at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@priyankachopra @nickjonas pic.twitter.com/6UveIg2XFX
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023