India’s highest taxpayer: దేశంలో ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ (Income tax) రిటర్న్ ఫైలింగ్ హడావుడి నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లందరూ ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేయడంలో బిజీలో ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువు జులై 31తో ముగియనుండగా జులై 30 వరకు వరకు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను ఎవరు కడుతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తి ఉండవచ్చు. అంబానీ, అదానీనో లేదా టాటా, బిర్లానో కడుతుంటారులే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టేది వీళ్లెవరూ కాదు.. అసలు బిజినెస్‌మెన్‌లే కాదు.. మరి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar).
ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్. అక్షయ్ కుమార్ 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ సంవత్సరం ఆయన తన వార్షిక ఆదాయాన్ని రూ. 486 కోట్లుగా ప్రకటించారు.
అంతకుముందు కూడా ఆయనే..
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్‌లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ని నడుపుతున్నారు. ఇక వివిధ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్‌ల నుంచి కూడా చాలానే ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అక్షయ్ కుమారే హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్ కావడం విశేషం. ఆ సంవత్సరంలో ఆయన రూ. 25.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.
దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి బిజినెస్‌మెన్‌ల పేర్లు చెబుతారు. కానీ వారెందుకు టాప్ ట్యాక్స్ పేయర్ల జాబితాలో లేరు అను సందేహం చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానం.. ఆ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత ఆస్తులు లేవు. అన్నీ వారి కంపెనీల పేరుతోనే ఉంటాయి. కాబట్టి ఆదాయాలు కూడా వారి కంపెనీల వాటాకు వెళ్తాయి. ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్‌కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి.
ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Comments
Please login to add a commentAdd a comment