taxpayer
-
పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట..!
-
దేశంలో అందరి కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేదెవరో తెలుసా?
India’s highest taxpayer: దేశంలో ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ (Income tax) రిటర్న్ ఫైలింగ్ హడావుడి నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లందరూ ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేయడంలో బిజీలో ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువు జులై 31తో ముగియనుండగా జులై 30 వరకు వరకు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను ఎవరు కడుతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తి ఉండవచ్చు. అంబానీ, అదానీనో లేదా టాటా, బిర్లానో కడుతుంటారులే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టేది వీళ్లెవరూ కాదు.. అసలు బిజినెస్మెన్లే కాదు.. మరి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్. అక్షయ్ కుమార్ 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ సంవత్సరం ఆయన తన వార్షిక ఆదాయాన్ని రూ. 486 కోట్లుగా ప్రకటించారు. అంతకుముందు కూడా ఆయనే.. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ని నడుపుతున్నారు. ఇక వివిధ బ్రాండ్ల ఎండార్స్మెంట్ల నుంచి కూడా చాలానే ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అక్షయ్ కుమారే హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్ కావడం విశేషం. ఆ సంవత్సరంలో ఆయన రూ. 25.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి బిజినెస్మెన్ల పేర్లు చెబుతారు. కానీ వారెందుకు టాప్ ట్యాక్స్ పేయర్ల జాబితాలో లేరు అను సందేహం చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానం.. ఆ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత ఆస్తులు లేవు. అన్నీ వారి కంపెనీల పేరుతోనే ఉంటాయి. కాబట్టి ఆదాయాలు కూడా వారి కంపెనీల వాటాకు వెళ్తాయి. ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్‌కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు -
ఒక్క వ్యక్తే రూ.21,780కోట్ల పన్ను బాకీ!
న్యూఢిల్లీ : ఓ వైపు ఆదాయ అసమానతల్లో వ్యత్సాసాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో భారీగానే ఎగనామం పెడుతున్నారు. పన్నులు చెల్లింపులు ఏ మేర బాకీ పడుతున్నాయో ఆదాయపు పన్ను విభాగం తాజా గణాంకాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఒక్క వ్యక్తే దాదాపు రూ.21,780 కోట్ల ఆదాయపు పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పేరు తెలియని ఓ వ్యక్తి రూ.21,870 కోట్ల పన్ను బాకీ పడినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తాజా డేటా వెల్లడించింది. భారతీయులందరూ చెల్లించే పన్నుల్లో 11 శాతం ఆ వ్యక్తే చెల్లించాల్సి ఉందని తెలిపింది. అదేవిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు రూ.500 కోట్లకు పైనే ఉన్నాయట. కానీ ఆ వ్యక్తులు ఎవరన్నది బయటకి వెల్లడికాలేదు. ఇటీవల ఆదాయ అసమానతలపై ఆక్స్‌ఫామ్ ఇండియా సంచలన రిపోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1 శాతానికి పైగా భారతీయుల చేతుల్లోనే 58 శాతం సంపద ఉందని ఈ రిపోర్టు పేర్కొంది. 57 బిలినియర్ల సంపద కిందిస్థాయి 70 శాతం మంది వద్దనున్న సంపదకు సమానమని తెలిపింది. అమెరికాలో టాప్ 1 శాతం మంది వద్ద 19 శాతం ఆదాయం ఉండగా.. వారు 38 శాతం పన్నులు చెల్లిస్తున్నారని ఆ దేశప్రభుత్వం పేర్కొంది. కానీ భారత్‌లో వీటిని కొలవడం కుదరదు. ఏ నిష్ఫత్తిలో ఆదాయ, పన్నులను భారతీయులు చెల్లిస్తున్నారని తెలియదు. ఎందుకంటే ఆ డేటాను ప్రభుత్వం విడుదల చేయదు. పన్ను వసూళ్లు యేటికేటికి పెరుగుతున్నప్పటికీ, తప్పించుకునే వారు దర్జాగానే తప్పించుకుంటున్నట్టు తెలిసింది. -
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
-
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
న్యూఢిల్లీ : అత్యధిక మొత్తంలో ఆదాయాలు ఆర్జిస్తున్నా ప్రభుత్వ అందిస్తున్న వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎందుకు వదులుకోవాలంటూ వ్యవహరిస్తున్న వారందరికీ కేంద్రప్రభుత్వం షాకివ్వబోతుంది. నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తున్న పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని పెట్రోలియం, ఆయిల్ మంత్రిత్వశాఖకు మార్పిడి చేస్తోంది. ఈ సమాచార మార్పిడితో రూ.10 లక్షల కంటే ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి వివరాలను పెట్రోలియం శాఖకు అందనున్నాయి. దీంతో వంటగ్యాస్‌పై సబ్సిడీ వివరాలను చెక్ చేసి, ఒకవేళ ఎవరైనా రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తూ సబ్సిడీ పొందుతున్నట్టు తెలిస్తే వారికి వెంటనే గ్యాస్ సబ్సిడీలో కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ ఆర్జన వివరాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలు పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, జెండర్, ఐటీ డేటా బేస్‌లోని అందుబాటులో ఉండే అన్నీ అడ్రస్‌లు, ఈ-మెయిల్ ఐడీ, ఇంటి ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్లు వంటి వాటిని ఐటీ డిపార్ట్మెంట్ పెట్రోలియం శాఖకు అందించనుంది. దీనికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్కు, మంత్రిత్వశాఖకు ఓ అవగాహన ఒప్పందం జరుగనుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పన్నుచెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా పంచుకోనున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయాన్ని ఆర్జించే వారికి వంటగ్యాస్‌పై సబ్సిడీ కోత విధించబోతున్నారు. ఆటోమేటిక్‌గా వారి ఈ సబ్సిడీలను విరమించబోతున్నారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా సబ్సిడీలను వదులుకున్న సంగతి తెలిసిందే.