అత్యధిక మొత్తంలో ఆదాయాలు ఆర్జిస్తున్నా ప్రభుత్వ అందిస్తున్న వంటగ్యాస్పై సబ్సిడీని ఎందుకు వదులుకోవాలంటూ వ్యవహరిస్తున్న వారందరికీ కేంద్రప్రభుత్వం షాకివ్వబోతుంది. నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తున్న పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని పెట్రోలియం, ఆయిల్ మంత్రిత్వశాఖకు మార్పిడి చేస్తోంది. ఈ సమాచార మార్పిడితో రూ.10 లక్షల కంటే ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి వివరాలను పెట్రోలియం శాఖకు అందనున్నాయి. దీంతో వంటగ్యాస్పై సబ్సిడీ వివరాలను చెక్ చేసి, ఒకవేళ ఎవరైనా రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తూ సబ్సిడీ పొందుతున్నట్టు తెలిస్తే వారికి వెంటనే గ్యాస్ సబ్సిడీలో కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.