న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఇండిగో బ్రాండు విమాన సర్వీసుల కంపెనీ ఏప్రిల్-జూన్(క్యూ1)లో టర్న్‌అరౌండ్ అయ్యింది. కొత్త రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,091 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ బాటలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 17,161 కోట్ల టర్నోవర్ అందుకుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!)
గత క్యూ1లో రూ. 13,019 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. ఒక త్రైమాసికంలో రికార్డ్ సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా ఇండిగో చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు సాధించినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.జూన్ చివరికల్లా మొత్తం నగదు నిల్వలు రూ. 27,400 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడుల సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment