Quarterly Profit
-
అదానీ గ్రూప్ చరిత్రలోనే అత్యధికం.. భారీ లాభాలు!
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఉమ్మడిగా రూ. 23,532 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాయి. గ్రూప్ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) క్యూ1తో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధి. ఇక 2018–19లో గ్రూప్ ఆర్జించిన పూర్తి ఇబిటా రూ. 24,780 కోట్లకు దాదాపు సమానమని అదానీ గ్రూప్ పేర్కొంది. డైవర్సిఫైడ్ కార్యకలాపాలు కలిగిన గ్రూప్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ తదితరాలున్నాయి. వీటి రూ. 42,115 కోట్ల నగదు నిల్వలను పరిగణించాక రూ. 18,690 కోట్ల నికర రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. -
భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఇండిగో బ్రాండు విమాన సర్వీసుల కంపెనీ ఏప్రిల్-జూన్(క్యూ1)లో టర్న్అరౌండ్ అయ్యింది. కొత్త రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,091 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ బాటలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 17,161 కోట్ల టర్నోవర్ అందుకుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) గత క్యూ1లో రూ. 13,019 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. ఒక త్రైమాసికంలో రికార్డ్ సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా ఇండిగో చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు సాధించినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.జూన్ చివరికల్లా మొత్తం నగదు నిల్వలు రూ. 27,400 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడుల సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. -
దూసుకుపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
వరుసగా ఏడో త్రైమాసికంలోనూ ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో దూసుకుపోయి రూ.8,022 కోట్ల లాభాలను నమోదుచేసింది. రిఫైనింగ్ మార్జిన్లలో మంచి లాభాలను ఆర్జించడంతో గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో స్వతంత్ర నికర లాభాలను రూ.8,022 కోట్లకు పెంచుకోగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం కంపెనీ రూ.7,856 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. ఫలితాల్లో ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది. మార్కెట్ అవర్స్ అనంతరం రిలయన్స్ ఫలితాలు వెల్లువడ్డాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్ 1.3 శాతం పడిపోయి రూ.1,077 వద్ద ముగిసింది. టెలికాం సేవలందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రైబర్ బేస్ కూడా డిసెంబర్ 31 వరకు 7 కోట్ల మార్కును చేధించినట్టు కంపెనీ తెలిపింది. 90 శాతం కంటే ఎక్కువ జనాభాను జియో ఆపరేషన్లను త్వరలోనే కవర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా రిలయన్స్ జియో పేరొందుతోంది. వరుసగా ఎనిమిది త్రైమాసికాల నుంచి కంపెనీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లను రెండంకెల సంఖ్యలో నమోదుచేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. గ్లోబల్‌గా వస్తున్న డిమాండ్‌తో జీఆర్ఎమ్లు గణనీయమైన వృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. యేటికేటికి కంపెనీ మొత్తం ఆదాయాలు సుమారు 10 శాతం పెరిగి రూ.69,631 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరం ఇదే కాలంలో రూ.63,406 కోట్ల ఆదాయాలను కంపెనీ ఆర్జించింది.