న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఉమ్మడిగా రూ. 23,532 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాయి.
గ్రూప్ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) క్యూ1తో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధి. ఇక 2018–19లో గ్రూప్ ఆర్జించిన పూర్తి ఇబిటా రూ. 24,780 కోట్లకు దాదాపు సమానమని అదానీ గ్రూప్ పేర్కొంది.
డైవర్సిఫైడ్ కార్యకలాపాలు కలిగిన గ్రూప్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ తదితరాలున్నాయి. వీటి రూ. 42,115 కోట్ల నగదు నిల్వలను పరిగణించాక రూ. 18,690 కోట్ల నికర రుణ భారాన్ని కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment