
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు మరింత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలకు చేరాయి. శుక్రవారం నాటి పెరుగుదలతో పెట్రోల్ ధర 55నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. డీజిల్ కూడా ఇదే బాటలో రికార్డ్ స్థాయికి ఎగబాకి మరింత మండుతోంది. పెట్రోల్ ధర ఈ నెల ఆరంభంనుంచి మొత్తం 50 పైసలుపైగా పెరగగా, డీజిల్ ధర 90పైసలకు పైగా ఎగిసింది. 2013 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నట్లు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఇండియన్ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం శుక్రవారం పెట్రోలు ధర 1 పైసలు, డీజిల్ ధర 4 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ లీటరు 74.08 రూపాయలు, కోలకతాలో రూ. 76.78, ముంబైలో రూ. 81.93, చెన్నైలో రూ. 76,85గా ఉంది. డీజిల్ ధరకూడా రికార్డు స్థాయిని తాకింది. ఢిల్లీలో రూ. 65.31, కోలకతాలో 68.01 వద్ద ముంబైలో రూ. 69.54 , చెన్నైలో రూ. 68.90గా ఉన్నాయి.
గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ప్రస్తుతం 73.78 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment