ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రీటైలర్ల తాజా నిర్ణయంతో లీటరుకు రూ. 60 పైసలు పెరిగింది. ఇంతకు ముందు మార్చి 16న చివరిసారిగా ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రం.. పెట్రోల్, డీజిల్‌పై స్పెసిఫిక్ ఎక్సైజ్ డ్యూటీ వేయటంతో మార్చి 14న లీటర్‌పై మూడు రూపాయలు పెరిగింది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గుకుంటూ వచ్చాయి. అయినప్పటికి ఇంధన రీటైలర్లు నష్టాల దృష్టా‍్య తగ్గిన ధరలతో అమ్మకాలు చేపట్టలేదు.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
1) హైదరాబాద్ : పెట్రోల్ రూ. 74.61, డీజిల్ రూ. 68.42
2) బెంగళూరు : పెట్రోల్ రూ. 74.18, డీజిల్ రూ. 66.54
3) చెన్నై : పెట్రోల్ రూ. 76.07 , డీజిల్ రూ. 68.74
4) న్యూఢిల్లీ : పెట్రోల్ రూ. 71.86, డీజిల్ రూ. 69.99
5) ముంబై: పెట్రోల్ రూ. 78.91, డీజిల్ రూ. 68.79
6) గురుగావ్ : పెట్రోల్ రూ. 71.68 , డీజిల్ రూ. 63.65
Comments
Please login to add a commentAdd a comment