దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా జియోబీపీ సంస్థ ప్రముఖ టూవీలర్ మేకర్ టీవీఎస్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త్వరలో రాబోతున జియో బీపీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో టీవీఎస్ వాహనాలకు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం కానుంది.
రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జియోబీపీ ప్లస్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఐక్యూబ్ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో అడుగు పెట్టిన టీవీఎస్ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా జియోబీపీ, టీవీఎస్‌లు జట్టు కట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment