భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్‌బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.
టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్‌పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment