ఒక టూ వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలైన వెచ్చించాల్సిందే వెచ్చించాల్సిందే అనుకుంటారు. అయితే ఇక్కడ మేము చెప్పబోయే ద్విచక్రవాహనాలు మాత్రం రూ. 50వేలు కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
యో ఎడ్జ్: ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 49,086 మాత్రమే (ఎక్స్ షోరూమ్). 1.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక ఫుల్ ఛార్జీతో 60 కిమీ రేంజ్ అందిస్తుంది3. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. కేవలం 95 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టీవీఎస్ ఎక్స్ఎల్ 100: ఎక్కువగా గ్రామాల్లో కనిపించే ఈ టూ వీలర్.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం. రూ. 46671 (ఎక్స్ షోరూమ్) విలువైన ఈ వెహికల్ బరువులు మోయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మన ఊరి బందీగా ప్రసిద్ధి చెందిన ఈ ఎక్స్ఎల్ 100 ఇప్పటికి 10 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం.
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ: రూ. 44,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఫ్రెండ్లీ బడ్జెట్ టూ వీలర్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ 99.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది కేవలం 88 కేజీల బరువున్నప్పటికీ.. 59.5 కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.
పైన చెప్పిన టూ వీలర్ ధరలు.. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధరల్లో మార్పు ఉంటుంది. ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment