![TVS Apache RR 310 2021 launched in India - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/30/2021-tvs-apache-rr-310.jpg.webp?itok=Y3CgxGlU)
టీవీఎస్ మోటార్ కంపెనీ 2021 అపాచీ ఆర్ఆర్ 310ని భారతదేశంలో రూ.2.60 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఆర్ఆర్ 310లో కొత్త ఫీచర్స్, కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. టీవీఎస్ మోటార్ ఇప్పటికే కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బుకింగ్స్ ప్రారంభించింది. ఆర్ఆర్ 310లో ముందు, వెనుక సస్పెన్షన్లను ట్వీక్ చేసింది. ఈ కొత్త బైక్ మునుపటి బైక్ కంటే అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్‌ఈడీ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి.
అపాచీ ఆర్ఆర్ 310నిలోని డిజిటల్ క్లస్టర్ యూనిట్ లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డే ట్రిప్ మీటర్, డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్, ఓవర్ స్పీడ్ ఇండికేటర్ లను చూపిస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ జీ 310 ఆర్ ఇంజిన్ ఆధారంగా 310 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో కొత్త అపాచీ ఆర్ఆర్ 310 వస్తుంది. 34 బిహెచ్‌పి శక్తి, 27.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 2021 అపాచీ ఆర్ఆర్ 310 ప్రారంభించాలని టీవీఎస్ కంపెనీ ఇంతకు ముందు యోచించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా లాంచ్ ఆలస్యమైంది. 2021 అపాచీ ఆర్ఆర్ 310 కెటిఎమ్ ఆర్ సీ 390, కావాసాకీ నింజా 300, బెనెల్లీ 302ఆర్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment