TVS Raider Single Piece Seat Variant Launched In India, Check Price Details And Features - Sakshi
Sakshi News home page

TVS Raider India Launch: రూ. లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన కొత్త బైక్ - మరిన్ని వివరాలు

Published Fri, Apr 14 2023 1:35 PM | Last Updated on Fri, Apr 14 2023 1:44 PM

Tvs raider single piece seat variant launched price and details - Sakshi

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్‌ సింగిల్-పీస్ సీట్‌' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ (SmartXonnect) వేరియంట్‌కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్‌ సింగిల్ పీస్ సీట్‌ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్‌ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది.

డిజైన్ & ఫీచర్స్:
టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి.

(ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!)

ఇంజిన్ & పర్ఫామెన్స్:
టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ కలిగి 11.4 హెచ్‌పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 

టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్‌ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్‌ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement