హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆన్‌రోడ్ ధర ఢిల్లీలో రూ.98 వేల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 100–140 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది.
టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్‌లో మూడు చార్జింగ్ ఆప్షన్స్, 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్, క్లీన్‌యూఐ, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్‌సెట్, ఇన్‌ట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్‌డేట్స్, ఫాస్ట్ చార్జింగ్, మల్టిపుల్ బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ, 32 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం వంటి హంగులు ఉన్నాయి. రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 33 నగరాల్లో ఐక్యూబ్ లభిస్తుంది. త్వరలో మరో 52 నగరాలను జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
చదవండి: ‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు
Comments
Please login to add a commentAdd a comment