Tvs Jupiter
-
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్‌ఎక్స్‌సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్‌గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్‌సేల్‌గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్‌కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్‌లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
జుపీటర్ 125 Vs యాక్టివా 125: ఏది బెస్ట్?
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ''టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125''. ఈ రెండూ 125సీసీ విభాగంలోనే స్కూటర్లు. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో ఏ స్కూటర్ కొనుగోలు చేయాలి?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధరలు, మైలేజ్ వంటి విషయాలు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాంటి వారికోసం ఈ కథనం ఓ చక్కని పరిష్కారం..టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్స్ రెండూ డిజైన్, ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ధర, మైలేజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ బేరీజు వేసుకుని.. అవసరాలకు దృష్ట్యా నచ్చిన స్కూటర్ ఎంచుకోవడం అనేది పూర్తిగా కొనుగోలు చేసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. -
టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన ధరలు!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ జూపిటర్ 110 కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఇటీవల జూపిటర్ 125 స్కూటర్ లాంచ్ చేసిన తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు తన అత్యంత ప్రజాదరణ పొందిన జూపిటర్ 110 స్కూటర్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరల పెంపుతో, జూపిటర్ 110 ఇప్పుడు ధర రూ.600 వరకు పెరగనుంది. టీవీఎస్ జూపిటర్ 110 వేరియెంట్ వారీగా కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. షీట్ మెటల్ వీల్: ₹66,273 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) స్టాండర్డ్: ₹69,298 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) జడ్ ఎక్స్ (డ్రమ్ బ్రేక్): ₹72,773 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) జడ్ ఎక్స్ (డిస్క్ బ్రేక్): ₹76,573 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) క్లాసిక్: ₹76,543 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ చేత పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. -
టీవీఎస్ నుండి మరో కొత్త వెహికల్, ధర ఎంతంటే?
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.73,400. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ ఇంజన్‌తో తయారైంది. అధిక మైలేజీ కోసం ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వాడారు. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ ఇంటెల్లిగో, సీట్ కింద 33 లీటర్ల స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మోనోట్యూబ్ షాక్స్, ఆల్ ఇన్ వన్ లాక్ వంటి హంగులు ఉన్నాయి. ఇప్పటికే టీవీఎస్ మోటార్ జూపిటర్ 110 వర్షన్‌ను విక్రయిస్తోంది. -
97 శాతం పెరిగిన టీవీఎస్ మోటార్ లాభం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.88.84 కోట్ల నికర లాభం(స్టాండ్ ఎలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.45.19 కోట్లు)తో పోల్చితే 97 శాతం వృద్ధి సాధించామని కంపెనీ పేర్కొంది. మెటార్ సైకిళ్ల అమ్మకాల్లో మంచి వృద్ధికి తోడు గ్రూప్ కంపెనీలో మోజారిటీ వాటా విక్రయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని వివరించింది. ఇక నికర అమ్మకాలు రూ.1,683.41 కోట్ల నుంచి రూ.1,962.03 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 65 పైసల మధ్యంతర డివిడెండ్‌ను (65 శాతం) కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఎనర్జీలో కంపెనీ తన వాటాను విక్రయించింది. ఈ విక్రయంపై రూ.30.28 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలానికి మోటార్ సైకిళ్ల అమ్మకాలు 18 శాతం, స్కూటర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని, మొత్తం మీద టూవీలర్ల విక్రయాలు 2 శాతం, ఎగుమతులు 27 శాతం, త్రీ వీలర్ల ఎగుమతులు 85 శాతం చొప్పున వృద్ధి సాధించాయని కంపెనీ తెలిపింది. -
పురుషుల కోసం టివిఎస్ జూపిటర్