న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) పథకాన్ని తెచ్చామని, వీఆర్‌ఎస్‌కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు.
గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు. కాగా, పండుగల సీజన్ ముగిసిన తర్వాత భారత్ స్టేజ్–సిక్స్ (బీఎస్–సిక్స్) మోటార్ బైక్‌లను కంపెనీ అందుబాటులోకి తేనుంది.
Comments
Please login to add a commentAdd a comment