చెన్నై: ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 549.36 కోట్ల నికర లాభం పోస్ట్ చేసింది. గత ఆర్థిక త్రైమాసికం రూ 621.03 కోట్ల పోలిస్తే ఇది 11.5 తగ్గినట్టు కంపెనీ బీఎస్ సీ ఫైలింగ్ లో తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ 14,218.27 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ 13,702 కోట్లుగా ఉంది.
అయితే, మూడు నెలల కాలంలో బ్యాంకు సంపాదించిన మొత్తం వడ్డీ 4.16 శాతం క్షీణించి రూ 11,830.36 కోట్లు. గత ఏడాది రూ. 12,345 కోట్లుగా ఉంది. బ్యాడ్ రుణాల శాతం 34.6 శాతం పెరిగి రూ 2,534కోట్లు, గత ఏడాది రూ. 1,882కోట్ల బ్యాడ్ లోన్ల విలువ ఉన్నట్టు కంపెనీ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 13,63 శాతం పెరిగాయి. ఇదే కాలంలో గత ఆర్థిక సంవత్సరంలో 6.36 శాతం ఉండగా రెండవ త్రైమాసికంలోనికర మొండి బకాయిలు కూడా 9.10 శాతానికిపెరిగాయి.
పీఎన్బీ లాభాల క్షీణత
Published Sat, Nov 5 2016 3:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
Advertisement
Advertisement