
బీఓబీ లాభం 89 శాతం డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 89% క్షీణించింది. గత క్యూ2లో రూ.1,104 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.124 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పడిపోయిందని వివరించింది. గత క్యూ2లో రూ.11,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ. 12,300కు ఎగసిందని పేర్కొంది.
ఢిల్లీలోని అశోక్ విహార బ్రాంచ్‌లో రూ.11 కోట్ల మోసాన్ని గుర్తించామని, ఆర్‌బీఐకు నివేదించామని తెలిపింది. ఒక రుణ గ్రహీత రూ.374 కోట్ల ఖాతాకు గాను 25% మొత్తానికి(రూ.94 కోట్లు)కు కేటాయింపులు జరిపామని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.32% నుంచి 5.56%కి పెరిగాయని వివరించింది.