
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. అక్టోబర్ 6 నుంచి తదుపరి మూడేళ్ల కాలానికి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలియజేసింది.
ఈ ఏడాది జూలైలో ప్రశాంత్ కుమార్ నియామక ప్రతిపాదనను యస్ బ్యాంకు ఆర్‌బీఐకి పంపింంది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు పునరుద్ధరణకు వీలుగా ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్న అనంతరం.. 2020లో ప్రశాంత్ కుమార్ మొదటిసారి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా నియమితులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment