న్యూఢిల్లీ: అకారణంగా ఓ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు నగదును డెబిట్ చేసినందుకు.. ఆ మొత్తంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల వివాదాల జాతీయ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. తమ సేవా లోపం లేదన్న బ్యాంకు వాదనను తిరస్కరించింది. పరిహారం కింద రూ.25,000తోపాటు, నగదును డెబిట్ చేసి నాటి నుంచి ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారి గోపాల్ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు రూ.40,85,254ను 2015 ఏప్రిల్ 11న డెబిట్ చేసింది. అయితే, ఇందుకు తగిన కారణాన్ని చూపలేకపోయింది. దీంతో సేవా లోపంగా కమిషన్ పరిగణించింది. దీనివల్ల గోపాల్‌కు నష్టం జరిగినట్టు గుర్తించి ఈ ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment