National Commission
-
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పురుషుల హక్కుల పరిరక్షణకు ‘జాతీయ కమిషన్ ఫర్ మెన్’ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల కేసులపై విచారణకు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్ న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ కోరారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో 1,64,033 ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 81,063 మంది వివాహితులైన పురుషులున్నారని, 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. వీరిలో కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడిన వారు 33.2% కాగా, వివాహ సంబంధిత సమస్యలతో 4.8% మంది తనువు చాలించినట్లు తెలిపారు. వివాహమైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారు. పెళ్లవగానే చనిపోతున్న యువతుల డేటాను మీరివ్వగలరా? చనిపోవాలని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. పిల్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇచ్చింది. -
వయసు 10.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు.. రోజుకు 4 గంటలు
న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్‌ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్‌ను, 10.1శాతం మంది ఆన్లైన్లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు 76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్ ఎక్కాకా ఫోన్ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. -
లక్ష్మీ విలాస్ బ్యాంకుకు కమిషన్ మొట్టికాయ
న్యూఢిల్లీ: అకారణంగా ఓ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు నగదును డెబిట్ చేసినందుకు.. ఆ మొత్తంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల వివాదాల జాతీయ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఆదేశించింది. తమ సేవా లోపం లేదన్న బ్యాంకు వాదనను తిరస్కరించింది. పరిహారం కింద రూ.25,000తోపాటు, నగదును డెబిట్ చేసి నాటి నుంచి ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారి గోపాల్ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు రూ.40,85,254ను 2015 ఏప్రిల్ 11న డెబిట్ చేసింది. అయితే, ఇందుకు తగిన కారణాన్ని చూపలేకపోయింది. దీంతో సేవా లోపంగా కమిషన్ పరిగణించింది. దీనివల్ల గోపాల్‌కు నష్టం జరిగినట్టు గుర్తించి ఈ ఆదేశాలు ఇచ్చింది. -
పాలేకర్ ప్రకృతి సేద్యంపై అధ్యయన కమిటీ
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతి(దీన్ని మొదట్లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే వారు) ని అనుసరించడం వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాలేకర్ నేర్పిన పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. ఎస్. భాస్కర్ ఇటీవల నియమించారు. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన ఈ కమిటీకి ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. వి. ప్రవీణ్‌రావు సారధ్యంవహిస్తారు. ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీలో ఐ.సి.ఎ.ఆర్. డీడీజీ డా. ఎస్. భాస్కర్‌తోపాటు మోదీపురంలోని భారతీయ వ్యవసాయ వ్యవస్థల పరిశోధనా సంస్థ సంచాలకులు డా. ఎ. ఎస్. పన్వర్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం సిక్కిం సంయుక్త సంచాలకులు డా. ఆర్. కె. అవస్థె, కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సుస్థిర సేంద్రియ వ్యవసాయ విభాగం అధిపతి ప్రొ. ఇ. సోమసుందరం, ఉదయ్‌పూర్‌లోని ఎం.పి.ఎ.ఎ.టి. సేంద్రియ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డా. ఎస్.కె. శర్మ, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా సేంద్రియ వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డా. సి.ఎస్. యూలఖ్, అపెడా (ఘజియాబాద్) మాజీ సంచాలకుడు డా. ఎ. కె. యాదవ్, కేంద్ర వ్యవసాయ– సహకార– రైతుల సంక్షేమ శాఖ సంయుక్త కారదర్శి, నీతి ఆయోగ్ వ్యవసాయ సలహాదారు సభ్యులుగా ఉంటారు. భారతీయ సాగు వ్యవస్థల పరిశోధనా సంస్థ (మోదిపురం) ముఖ్య శాస్త్రవేత్త డా. ఎన్. రవిశంకర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇదీ కమిటీ అధ్యయన పరిధి.. 1 ఎస్.పి.ఎన్.ఎఫ్. (ఇంతకుముందు జడ్.బి.ఎన్.ఎఫ్. అనేవారు)పై వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనుబంధ సంస్థల్లో, సేంద్రియ వ్యవసాయంపై అఖిలభారత నెట్వర్క్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఎస్.పి.ఎన్.ఎఫ్.పై భవిష్యత్తులో నిర్వహించే పరిశోధన వ్యూహాలలో చేర్చదగిన అంశాలపై సిఫారసులు చేస్తుంది. 2 సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) సాగు పద్ధతి బలాలు, బలహీనతలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఫలితాలను అంచనా వేసేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది. 3 ఎస్.పి.ఎన్.ఎఫ్.ను దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తెస్తే భారత దేశంలో భూమి ఆరోగ్యం, ఉత్పాదకత, ఆహార ఉత్పత్తి, జీవనభృతులు, వ్యవసాయ రంగ సుస్థిరత తదితర అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదీ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. 4 శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎస్.పి.ఎన్.ఎఫ్. పద్ధతులను సమ్మిళితం చేయడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి కాలపరిమితి లేదు. -
విశ్వవ్యాప్తంగా.. ఘనంగా!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిలషించారు. ఐక్యరాజ్య సమితి సహా అన్ని ప్రపంచ వేదికలపై ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో బుధవారం వారిరువురు ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని కోవింద్ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు కూడా మహాత్ముడు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ‘కార్యాంజలి’ థీమ్ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రూపొందించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చైనా మేధావి క్వాన్యూ షాంగ్, అమెరికన్ గాంధీగా పేరుగాంచిన బెర్నీ మీయర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రధాని నేతృత్వంలో 125 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. సీజేఐ, సోనియా, రాహుల్ గైర్హాజరు ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరయ్యారు. -
హోమియోపతి అభివృద్ధికి జాతీయ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రోత్సహించడంతో పాటు నైపుణ్యమున్న వైద్య నిపుణుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నేషనల్ హోమియోపతి కమిషన్(ఎన్సీహెచ్) పేరుతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ హోమియోపతి రంగంలో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనల్ని పర్యవేక్షిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు మనోజ్ రజోరియా వెల్లడించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి(సీసీఆర్‌హెచ్) నిర్వహించిన రెండురోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో మనోజ్ మాట్లాడారు. ‘ఎన్‌సీహెచ్‌లో ఉండే నాలుగు బోర్డులు డిగ్రీ, పీజీ కోర్సుల పర్యవేక్షణ, విద్యాసంస్థలకు అక్రిడేషన్ ఇవ్వడం, తనిఖీ చేయడం, డాక్టర్ల సంఖ్యను నియంత్రించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి’ అని ఆయన తెలిపారు.