అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ | Most employees in the private bank as ICICI | Sakshi
Sakshi News home page

అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ

Published Mon, Jun 9 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

Most employees in the private bank as ICICI

 న్యూఢిల్లీ: అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో 10,161 కొత్త కొలువులు ఇచ్చామని, దీంతో 72,226 మందితో అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. కాగా గతేడాదిలో హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగుల సంఖ్య 900 తగ్గి 68,165కు చేరింది. 2012-13లో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 62,065గా ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 69,065గా ఉంది.  కాగా, గతేడాది కనీసం 5 ప్రైవేట్ బ్యాంకుల్లో(ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇండస్ ఇండ్, యస్ బ్యాంక్)సిబ్బంది సంఖ్య పెరిగింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం కొత్త కొలువులు(15,000) తో పోల్చితే ఈ ఐదు బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరంలో 22 వేల కొత్త కొలువులొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement