
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ధనలక్ష్మీ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్‌లో రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.22 కోట్లకు పెరిగిందని ధనలక్ష్మీ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో నికర లాభం దాదాపు రెట్టింపైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.227 కోట్ల నుంచి రూ.277 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.245 కోట్ల నుంచి రూ.253 కోట్లకు పెరిగాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment