సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి సత్రం భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై జుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన సదావర్తి సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.
సదావర్తి భూములపై హైకోర్టులో పిల్
Published Sat, Jun 25 2016 4:43 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement