సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతుబంధు పథకంపై హైకోర్టులో పిల్ దాఖలైంది.
రైతుబంధు పధకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సాయం వల్ల సామాన్యుల కంటే భూస్వాములకే మేలు జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. పథకంలో చాలా మార్పులు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 10 కి కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment