రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంలో ఆయనపై కేసు నమోదు చేసేలా సీబీఐని ఆదేశించాలని, నేరుగా నివేదిక సుప్రీంకోర్టుకే సమర్పించాలని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
అయితే దీనిపై తక్షణమే విచారణ జరపాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెల్ ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తనకున్న బ్రిటన్ పౌరసత్వాన్ని దాటిపెట్టి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని పిటిషనర్ ఆరోపించారు.