న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఓ నేత ఎన్నికల్లో ఒకే చోట పోటీ చేయాలన్నది ఆ పిల్ సారాంశం. కాగా, పిటిషనర్ వాదనతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పూర్తిగా ఏకీభవించింది. ఒక నేత ఒకే చోట పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలన్నది తమ అభిప్రాయమని, ఇప్పటికే కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశామని ఎన్నికల సంఘం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఎన్నికల సంఘం వివరించింది. ఒక నేత.. ఒకేచోట పోటీ చేయాలన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా కొందరు నేతలు రెండు చోట్ల ఎన్నికల బరిలో దిగడం, ఆ స్థానాల్లో విజయం సాధిస్తే ఓ స్థానానికి రాజీనామా చేస్తుంటారు. ఒకవేళ ఒకే స్థానంలో విజయం సాధిస్తే రాజీనామా ప్రస్తావనే ఉండదన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment