కమల్ హాసన్ కు మరో చిక్కు | Hindu Makkal Katchi filed PIL in Tirunelveli District Court against Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్ హాసన్ కు మరో చిక్కు

Published Tue, Mar 21 2017 12:29 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

కమల్ హాసన్ కు మరో చిక్కు

కమల్ హాసన్ కు మరో చిక్కు

చెన్నై: విలక్షణ నటుడు కమల్‌ హాసన్ పై కేసులు పరంపర కొనసాగుతోంది. హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తిరునల్వేలి జిల్లా కోర్టులో హిందూ మక్కల్‌ కట్చి(హెచ్‌ఎంకే) సభ్యులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందు హెచ్‌ఎంకే నిర్వాహకులు ఈ నెల 15న చెన్నై పోలీస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలను హెచ్‌ఎంకే ఖండించింది.

తమిళనాడులో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కమలహాసన్‌ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అధికారం కోసం జరిగిన కుమ్ములాటపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement