Hindu Makkal Katchi
-
'ఆ స్టార్ హీరోను తన్నిన వారికి నగదు బహుమతి'..సంచలన ప్రకటన
Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi: తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతిపై బెంగుళూరుఎయిర్పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ అనే వ్యక్తి సేతుపతిపై దాడికి యత్నించగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె ఈ ఘటనపై స్పందించిన సేతుపతి..ఇది చిన్న గొడవ అని, వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చూస్తున్నారంటూ కొట్టిపారేశారు. తాజాగా హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ తమిళ సూపర్‌స్టార్ సేతుపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి విజయ్ సేతుపతిని తన్నిన వారికి ఒక్క కిక్కు రూ. 1000రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ స్పందిస్తూ..స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని సేతపతి అవమానించాడని..ఆయన క్షమాపణ చెప్పేవరకు ఎక్కడ కనిపించినా కొట్టాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే -
మనోభావాలు కించపర్చలేదు: కమల్‌హాసన్
బిగ్‌బాస్ షో కారణంగా తమిళ సంస్కృతికి భంగం కలగలేదని నటుడు కమల్‌హాసన్ అన్నారు. ఆయన హోస్ట్ చేస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో 'బిగ్‌బాస్'పై వివాదం తలెత్తడంపై ఆయన బుధవారం స్పందించారు. బిగ్‌బాస్ షో ఎవరి మనోభావాలను కించపరచదని చెప్పారు. తమిళ భాష తెలియని వారికి నేర్పడం తప్పుకాదని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి ఉందని, దాన్ని రూపుమాపడానికి ఎవరో ఒకరు రావాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నమాటలను ప్రస్తావించారు. ఆ మాటలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వెజ్, నాన్ వెజ్ ఎవరి అలవాట్లు వారివని వాటిపై నిబంధనలు, ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. కాగా, షో పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ హెచ్ఎంకే (హిందూ మక్కల్ కట్చి) సంఘం సెక్రటరీ శివ.. చెన్నై పోలీస్ కమిషనర్‌కు కమల్‌హాసన్, షో నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
‘తలైవా’ వస్తున్నారు!
- ఇక రాజకీయంగా ఇక, అడుగులు - త్వరలో అధికారిక ప్రకటన: అర్జున్ సంపత్ వ్యాఖ్య - రజనీతో భేటీ సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాట చర్చ ఊపందుకుని ఉన్న విషయం తెలిసిందే. రజనీ రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ‘కాలా’ సినిమా షూటింగ్ నుంచి కాస్త విరామం దొరకడంతో తలైవా మళ్లీ రాజకీయ అంశాలపై దృష్టి కేంద్రీకరించారని తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా ఆదివారం అన్నదాతలతో భేటీ అయ్యారు. సోమవారం రజనీ హిందూ మక్కల్ కట్చి నేతలతో భేటీ అయ్యారు. మార్పు తలైవాతోనే సాధ్యం! రజనీ రాజకీయ అరంగ్రేటానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారి నోళ్లకు తాళం వేసేవిధంగా హిందూ మక్కల్ కట్చి నేతలు గళం విప్పారు. రజనీకి భద్రత కల్పించాలంటూ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్‌కు రజనీకాంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్, ప్రధాన కార్యదర్శి రామ్ రవికుమార్, యువజన ప్రధాన కార్యదర్శి గురుమూర్తితో పాటుగా పలువురు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి.. రజనీకాంత్‌ను కలిశారు. రాజకీయాల్లోకి రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తలైవా తనదైన స్టైల్లో చిరునవ్వుతో సమాధానం ఇచ్చినట్టు హిందూ మక్కల్ కట్చి వర్గాలు తెలిపాయి. ఈ భేటీ అనంతరం మీడియాతో అర్జున్ సంపత్ మాట్లాడుతూ, ‘తలైవా వస్తారు.. రావడం తథ్యం. త్వరలో అధికారిక ప్రకటన’ అని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని, మార్పు తలైవాతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొత్త పార్టీని ప్రకటించే కసరత్తుల్లో ఉన్నట్టున్నారని, రాజకీయంగా సింహం.. సింగిల్‌గా ప్రభంజనం సృష్టించడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ 12న కొత్తపార్టీ ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా చిరునవ్వుతో రజనీ సమాధానం ఇచ్చారని తెలిపారు. తమ మద్దతు రజనీకి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని, వాళ్లంతట వాళ్లే వచ్చి రజనీతో మర్యాదపూర్వకంగా కలిశారని తలైవా సన్నిహితులు పేర్కొనడం గమనార్హం. -
కమల్ హాసన్ కు మరో చిక్కు
చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ పై కేసులు పరంపర కొనసాగుతోంది. హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తిరునల్వేలి జిల్లా కోర్టులో హిందూ మక్కల్ కట్చి(హెచ్ఎంకే) సభ్యులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందు హెచ్ఎంకే నిర్వాహకులు ఈ నెల 15న చెన్నై పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను హెచ్ఎంకే ఖండించింది. తమిళనాడులో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కమలహాసన్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అధికారం కోసం జరిగిన కుమ్ములాటపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.