ఫేస్బుక్, వాట్సాప్లపై మరో ఫిర్యాదు | PIL to regulate internet calls on Zuckerberg-owned Facebook, WhatsApp filed in Delhi HC | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్, వాట్సాప్లపై మరో ఫిర్యాదు

Published Thu, Feb 23 2017 1:33 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్, వాట్సాప్లపై మరో ఫిర్యాదు - Sakshi

న్యూఢిల్లీ: మార్క్ జుకర్ బర్గ్ ప్రమోటెడ్ ఫేస్బుక్, వాట్సాప్లపై మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ప్లాట్ఫామ్లపై అందిస్తున్న ఇంటర్నెట్ కాల్స్ను రెగ్యులేటరీ కిందకి తీసుకురావాలంటూ వీడీ మూర్తి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్ను దాఖలుచేశారు.. దీన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఫేస్బుక్, వాట్సాప్ పై నమోదైన  పిల్పై తమ స్పందన ఏమిటో తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్లతో కూడిన బెంచ్ ఈ మేరకు నోటీసులను సంబంధిత మంత్రిత్వశాఖలకు జారీచేసింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై ఆరు వారాల్లోగా అఫిడివిట్లు దాఖలు చేయాలని, తదుపరి విచారణను మే 3న చేపట్టనున్నట్టు బెంచ్ పేర్కొంది.
 
ఫేస్బుక్, వాట్సాప్లు చేపడుతున్న ఈ నియంత్రణ లేని కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని, ప్రజాఖజానాకు భారీగా నష్టాలు చేకూరుస్తాయని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను, ఇండియాలో ఇదే తరహాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వాటిని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు లాగా ఓ రెగ్యులేటరీ ప్రేమ్ వర్క్లోకి తీసుకురావాలని పిటిషనర్ కోరారు. దీనికి సంబంధించి అథారిటీలను ఆదేశించాల్సిందిగా అభ్యర్థించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement