internet calls
-
కేంద్రం కీలక నిర్ణయం! కాల్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాల్స్ వివరాలన్నీ..!
న్యూఢిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, మెసేజీల సర్వీసులను అందించే సంస్థలు కూడా ఇకపై ఆ వివరాలను రెండేళ్ల పాటు తప్పనిసరిగా నిల్వ చేయాల్సి రానుంది. టెలికం శాఖ ఈ మేరకు సర్క్యులర్లను జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే వీటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిల్వ చేయాల్సిన కాల్ డేటా రికార్డుల పరిధిని ఇంటర్నెట్ కాల్స్‌కు కూడా పెంచుతూ ఏకీకృత లైసెన్సు(యూఎల్) నిబంధనలకు టెలికం శాఖ డిసెంబర్లో సవరణలు చేసింది. దీనికి కొనసాగింపుగా టెల్కోలతో పాటు వాయిస్ మెయిల్, ఆడియోటెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీస్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా వర్తించేలా తాజా నిబంధనలతో జనవరి 27న టెలికం విభాగం సర్క్యులర్లు జారీ చేసింది. శాటిలైట్ ఫోన్ సేవలు, డేటా సర్వీసులు అందించేందుకు లైసెన్సు పొందిన బీఎస్ఎన్ఎల్కు కూడా ఇదే తరహా సవరణను వర్తింపచేస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ తరహా లైసెన్సులు తీసుకున్న టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఏటీఅండ్‌టీ గ్లోబల్ నెట్వర్క్ మొదలైన వాటికి ఈ సవరణలు వర్తించనున్నాయి. శాటిలైట్ ఫోన్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలను ఏకీకృత లైసెన్స్ హోల్డర్లుగా పరిగణిస్తారు. (చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!) -
ఫేస్బుక్, వాట్సాప్‌లపై మరో ఫిర్యాదు
న్యూఢిల్లీ: మార్క్ జుకర్ బర్గ్ ప్రమోటెడ్ ఫేస్బుక్, వాట్సాప్‌లపై మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై అందిస్తున్న ఇంటర్నెట్ కాల్స్‌ను రెగ్యులేటరీ కిందకి తీసుకురావాలంటూ వీడీ మూర్తి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలుచేశారు.. దీన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఫేస్బుక్, వాట్సాప్ పై నమోదైన పిల్‌పై తమ స్పందన ఏమిటో తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు నోటీసులను సంబంధిత మంత్రిత్వశాఖలకు జారీచేసింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై ఆరు వారాల్లోగా అఫిడివిట్లు దాఖలు చేయాలని, తదుపరి విచారణను మే 3న చేపట్టనున్నట్టు బెంచ్ పేర్కొంది. ఫేస్బుక్, వాట్సాప్‌లు చేపడుతున్న ఈ నియంత్రణ లేని కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని, ప్రజాఖజానాకు భారీగా నష్టాలు చేకూరుస్తాయని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను, ఇండియాలో ఇదే తరహాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వాటిని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు లాగా ఓ రెగ్యులేటరీ ప్రేమ్ వర్క్‌లోకి తీసుకురావాలని పిటిషనర్ కోరారు. దీనికి సంబంధించి అథారిటీలను ఆదేశించాల్సిందిగా అభ్యర్థించారు. -
ఇంటర్నెట్ కాల్స్ కు కళ్లెం వేయండి
డాట్‌కు టెలికం కంపెనీల విజ్ఞప్తి న్యూఢిల్లీ: యాప్స్ ద్వా రా చేసే కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)ను నిలిపివేయాలని మొబైల్ ఆపరేటర్స్ సమాఖ్య సీఓఏఐ పేర్కొంది. సీఓఏఐ తాజాగా టెలికం కార్యద ర్శి జేఎస్ దీపక్‌కు ఒక లేఖ రాసింది. ఇందులో మొబైల్/ల్యాండ్‌లైన్ ఫోన్లకు కేటాయించిన నెంబర్ల ద్వారా నెట్వర్క్ సాయంతో ఇంటర్నెట్ కాల్స్ చేయడమనేది ప్రస్తుత ఇంటర్కనెక్షన్ నియమాలకు విరుద్ధమని, ఇలాంటి చర్యల వల్ల టెలికం కంపెనీలకు నష్టం కలుగుతోందని వివరించింది. ‘ఇంటర్నెట్ టెలిఫోనీ’, మొబైల్ ఫిక్స్డ్ లైన్ సర్వీసులనేవి వేరు వేరు అంశాలని తెలిపింది. కాగా బీఎస్ఎన్ఎల్ కూడా ఇటీవల ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్సీ సర్వీసును ప్రారంభించింది. దీనిపై సీఓఏఐ టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడంతో బీఎస్ఎన్ఎల్ తన సర్వీసును ప్రస్తుతానికి నిలిపివేసింది. -
ఇంటర్నెట్ కాల్స్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశీయంగా చేసే ఇంటర్నెట్ కాల్స్‌ను నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే టెలికం శాఖ (డాట్) కమిటీ ఇచ్చిన నివేదికకు సంబంధించి కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన డాట్ కమిటీ.. నెట్ ద్వారా ఉచిత కాల్స్ సదుపాయా న్ని కల్పించే స్కైప్, వాట్సాప్ వంటి యాప్స్‌ను టెలికం ఆపరేటర్లతో సమానంగా నియంత్రణ పరిధిలోకి తేవాలని కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శల నేపథ్యంలో మంత్రి తాజా వివరణ ఇచ్చారు. -
ఇంటర్నెట్పై నిఘా‘నేత్రం
న్యూఢిల్లీ: మీరు తరచూ ఫేస్బుక్, ట్విటర్ వాడుతుంటారా? ఈమెయిల్స్, చాటింగ్, ఇంటర్నెట్ కాల్స్, బ్లాగుల్లో మునిగితేలుతుంటారా? అందులో మిత్రులను సరదాగా ‘కాల్చేస్తా, పేల్చేస్తా.. చంపేస్తా’ అంటూ బెదిరిస్తుంటారా? అయితే ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. ఆన్లైన్లో ప్రమాదకర, అనుమానాస్పద సందేశాలను, సంభాషణలను పసిగట్టేందుకు ప్రభుత్వం త్వరలో ‘నేత్ర’ పేరుతో ఇంటర్నెట్ గూఢచర్య వ్యవస్థను ప్రారంభించనుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతోంది. వైబ్సైట్లు, ఆన్లైన్ అప్డేట్లతోపాటు, స్కైప్, గూగుల్ టాక్ వంటి సాఫ్ట్వేర్ల గుండా నడిచే సంభాషణల్లో అనుమానాస్పదంగా తోచిన వాటిని జల్లెడపట్టేందుకు భద్రతా సంస్థలు ఈ వ్యవస్థను వాడుకోనున్నాయి. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు చెందిన ప్రయోగశాల సెంటర్ ఫర్ ఆర్టిఫిసియల్ అండ్ రోబోటిక్స్(సీకెయిర్).. ‘నేత్ర’ను అభివృద్ధి చేసింది. ఇది అమల్లోకి వస్తే విద్రోహ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను వాడే అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల చర్యలపై మరింత పటిష్ట నిఘా ఉంచడానికి వీలవుతుందని అధికారులు చెప్పారు. నేత్ర అమలుపై హోం శాఖ, కేబినెట్ సెక్రటేరియట్, ఐబీ, సీ-డాట్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తదితర శాఖలు, సంస్థల అధికారులతో కూడిన అంతర్ మంత్రిత్వ బృందం ఇటీవల చర్చించింది. సైబర్ భద్రత కోసం ఓ వ్యూహాన్నీ రూపొందించింది. ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై నిఘా కోసం ఐబీ, కేబినెట్ సెక్రటేరియట్ సహా మూడు భద్రతా సంస్థలకు 300 జీబీ స్టోరేజీని కేటాయించే అవకాశముంది.