ఇంటర్నెట్ కాల్స్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశీయంగా చేసే ఇంటర్నెట్ కాల్స్‌ను నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే టెలికం శాఖ (డాట్) కమిటీ ఇచ్చిన నివేదికకు సంబంధించి కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన డాట్ కమిటీ.. నెట్ ద్వారా ఉచిత కాల్స్ సదుపాయా న్ని కల్పించే స్కైప్, వాట్సాప్ వంటి యాప్స్‌ను టెలికం ఆపరేటర్లతో సమానంగా నియంత్రణ పరిధిలోకి తేవాలని కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శల నేపథ్యంలో మంత్రి తాజా వివరణ ఇచ్చారు.