Minister Ravi Shankar Prasad
-
కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2005–06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అం దినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాం గ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తూ ఉంటే రాహుల్ గాంధీ, కుమార్తె ప్రి యాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారు. భూములిచ్చారు, విరాళాలు తీసుకున్నారు 2005–06లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్ చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎఫ్టీఏతో భారత్ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరందన్నారు. కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలు మధ్యప్రదేశ్‌లో జన సంవాద్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలున్నాయని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. డోక్లాం వివాదం సమయంలో రాహుల్ చైనా వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తప్పుదోవ పట్టిస్తున్నారా? : కాంగ్రెస్ లద్దాఖ్‌లోని భారత్ భూభాగంలోకి చైనా బలగాలు ప్రవేశించలేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. గల్వాన్ లోయలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు నిపుణులు చెబుతున్నారని, దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు వస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. -
హైకోర్టు విభజనకు త్వరలో ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబం ధించి అతి త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నాయని టీఆర్ఎస్ ఎంపీలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీనిచ్చారు. హైకోర్టు విభజన వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పూర్తయ్యే అవకాశముందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశా రు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ తదితరు లు గురువారం హైకోర్టు విభజన ఆలస్యం వార్తల నేపథ్యంలో మరోసారి రవిశంకర్‌ను ఢిల్లీలో కలిశా రు. హైకోర్టు విభజనలో ఆలస్యం జరగదని, ఇప్పటికే నోటిఫికేషన్ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు వినోద్‌కుమార్ మీడియాకు తెలిపారు. అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్‌తో భేటీ.. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కె.కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణకు వెనుకబడిన జిల్లాల కింద చివరి విడతగా రావాల్సిన నిధులను విడుదల చేయాలని జైట్లీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాసిన లేఖ వివరాలను ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జైట్లీ మూడ్రోజుల్లో నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన ట్టు ఎంపీలు తెలిపారు. అలాగే తెలంగాణలో పెండిం గ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేం దుకు అవసరమైన నిధుల విడుదల, కొన్ని స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడంపై పీయూష్ గోయల్‌తో ఎంపీలు చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కోరా రు. సమావేశం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆ ర్ఎస్ విజయం సాధించడంపై ఎంపీలకు పియూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. -
సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారా?
రూ.5 కోట్ల వరకూ ఆర్ అండ్ డీ నిధుల్ని ఇస్తామంటున్న కేంద్రం న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలకు కేంద్రం బొనాంజా ప్రకటించింది. స్టార్టప్ గానీ, మరే ఇతర సంస్థ గానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పరిశోధన చేసి, ఒరిజినల్ ఉత్పత్తుల్ని అభివృద్ధి చేస్తే... దానికోసం పెట్టిన మొత్తం ఖర్చును రూ.5 కోట్ల వరకూ తాము తిరిగి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. దీన్ని ‘చాలెంజ్ గ్రాంట్’గా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక సైబర్ సెక్యూరిటీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశంలో డిజిటల్/ ఇన్ఫర్మేషన్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. మొబైల్ ఫోన్లలోని సైబర్ సెక్యూరిటీ ఫైర్వాల్స్కు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సిందిగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు నోటీసులు జారీచేశామని గుర్తుచేశారు. ‘మేం టెలిఫోన్లకు సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలుండాలని భావిస్తున్నాం. వాటి రూపకల్పన జరుగుతోంది. ఈ విషయంలో రాజీపడం’ అన్నారు. డిజిటల్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వానికి గత మూడేళ్లలో రూ.57,000 కోట్లు మిగిలాయన్నారు. డీమోనిటైజేషన్ తర్వాత భీమ్ ప్లాట్ఫామ్లో లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నారు. భీమ్ యాప్ ట్రాన్సాక్షన్లు రోజుకు 3,700 నుంచి 5.4 లక్షలకు ఎగశాయన్నారు. విలువ పరంగా రోజుకు రూ.1.93 కోట్లు నుంచి రూ.87 కోట్లకు పెరిగిందన్నారు. ఎస్‌జీఐలో మిగులువాటాను కొంటున్న సెంబ్‌కార్ప్ ముంబై: సోలార్, విండ్వపర్ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్ కంపెనీ సెంబ్‌కార్ప్ గ్రీన్ ఎనర్జీ (ఎస్జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ నుంచి రూ. 1,410.2 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తెలిపింది. డీల్ 2018 తొలి త్రైమాసికంలో పూర్తికాగలదని సెంబ్‌కార్ప్ గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ చెప్పారు. దీంతో ఎస్జీఐ పూర్తి వాటా తమ చేతికి వస్తుందని ఆయన తెలిపారు. 1200 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏడు రాష్ట్రాల్లో ఎస్‌జీఐకి వున్నాయి. -
పటేల్ వల్లే తెలంగాణ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ స్టేట్‌ను విలీనం చేసే విశేష కృషిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేయకపోయి ఉంటే ప్రస్తుత తెలంగాణలో పరిస్థితులు ఇప్పటి మాదిరిగా ఉండేవి కావని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం బీజేపీ లీగల్, ఐటీ, ఇంటలెక్చువల్ సెల్ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సర్దార్ పటేల్-ఇంట్రికసీస్, ఇంపెరెటీవ్స్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్’ అనే అంశంపై రవిశంకర్‌ప్రసాద్ ప్రసంగించారు. నేటికీ విభజనవాదం, అల్లర్లు, ఆందోళనలు కొనసాగి ఉంటే, పాకిస్తాన్లోనో, స్వతంత్ర రాజ్యంగానో హైదరాబాద్ ఉండి ఉంటే ప్రస్తుత తెలంగాణలో ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ది జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. కశ్మీర్ అంశాన్ని కూడా అప్పటి ప్రధాని నెహ్రూకు బదులు పటేల్‌కు అప్పగించి ఉంటే అక్కడ ప్రస్తుత అలజడి ఉండేది కాదన్నారు. పటేల్ 563 సంస్థానాలను విలీనం చేస్తే, అప్పట్లో నెహ్రూ పర్యవేక్షణలో ఉన్న కశ్మీర్ సమస్య నేటికీ పరిష్కారం కాకుండా ఉందన్నారు. పటేల్‌ను మహాత్మాగాంధీ తొలి ప్రధానిని చేసి ఉంటే దేశ ముఖచిత్రమే మరో విధం గా ఉండేదన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన మూడేళ్ల కాలంలోనే 563 సంస్థానాలను విలీనం చేసి భారత్‌కు సమగ్ర స్వరూపం, సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. బ్రిటీష్ కాలం నాటి ఐసీఎస్ సర్వీసు స్థానంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. కాంగ్రెస్‌కు పటేల్ విపక్షమా, స్వపక్షమా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ స్వపక్షమా? విపక్షమా? అని రవిశంకర్‌ప్రసాద్ ప్రశ్నించారు. పటేల్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని, ఆయ న జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా బీజేపీ నిర్వహించడాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. దేశం కోసం ఎంతో కృషి చేసిన పటేల్ కు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల తర్వాత భారతరత్న 1991లో వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. అదీ కూడా నెహ్రూ కుటుంబానికి చెందని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఇది వచ్చిందన్న విషయాన్ని గమనించాలని చెప్పారు. చరిత్రను విస్మరించిన టీఆర్ఎస్: లక్ష్మణ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రను విస్మరించి, ఖాసిం రజ్వీ వారసత్వంగా వచ్చిన ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. నాడు పటేల్ పెట్టిన భిక్షతోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని, ఆ విధంగా జరగకపోతే హైదరాబాద్ ఉండేదా? తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యే వారా? అని ప్రశ్నించారు. భారత జాతి, సంస్కృతికి పటేల్ ఆత్మ అని మరో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జాతి నిర్మాణానికి పటేల్ పునాదిరాయిగా నిలిచారన్నారు. బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పటేల్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రొ.బి.సత్యనారాయణ, జీజీకే టెక్నాలజీస్ మేనేజింగ్ పార్టనర్ రఘు వీరబెల్లి, బీజేపీ లీగల్ సెల్ రవీందర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలో పోస్టల్ బ్యాంకులు
- కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి - మొదట ప్రధాన శాఖల్లో ఏర్పాటు - తర్వాత దశల వారీగా విస్తరణ - కేంద్రం పెట్టుబడి రూ.800 కోట్లు సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మక మార్పులతో పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న తపాలాశాఖ మరో పది నెలల్లో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే మార్చిలో తపాలా బ్యాంకులు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే భారత రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వగా తాజాగా కేంద్ర కేబినెట్ కూడా పచ్చజెండా ఊపటంతో తపాలా బ్యాంకుల ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆదివారం హైదరాబాద్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. తపాలా సర్కిళ్ల చీఫ్పోస్ట్మాస్టర్ జనరళ్ల జాతీయస్థాయి సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. మూడురోజుల ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి రావాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజాగా అన్ని అనుమతులు రావటంతో అందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,55,939 తపాలా కార్యాలయాలున్నాయి. ఇందులో 29,560 ప్రధాన పోస్టాఫీసులు కాగా మిగతావి శాఖ కార్యాలయాలు. అన్ని ప్రధాన తపాలా కార్యాలయాలకు అనుబంధంగా వచ్చే మార్చిలో బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేస్తాం’ అని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో కేంద్రం రూ.800 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఊపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తపాలా శాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తాను ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకునేనాటికి దేశంలో కేవలం 4 తపాలా ఏటీఎంలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 913కు పెరిగిందని ఆయన తెలిపారు. 230 పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలుంటే వాటిని 21,664 తపాలా కార్యాలయాలకు విస్తరించామన్నారు. డాక్ సేవక్‌ల వేతనాలు పెంచుతాం.. ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆదివారం తపాలా ఉద్యోగ సంఘాల సమాఖ్య 11వ అఖిల భారత ఫెడరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తపాలా శాఖలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతామన్నారు. కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ గ్రా మీణ డాక్ సేవక్ సిబ్బం దికి కనీస వేతనాలను పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీఎంస్ జాతీయ అధ్యక్షుడు బి.ఎన్.రాయ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి రవిశంకర్, పోస్టల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు శర్మ, తెలంగాణ కార్యదర్శి ఎం.డి.బేగ్, నాయకులు లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి తపాలా సర్కిలే... రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా తపాలా సర్కిళ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో కేంద్రప్రభుత్వం అంతసుముఖంగా లేదని రవిశంకర్ ప్రసాద్ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన తపాలా సర్కిళ్ల విభజన జరగాలని లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే రెండు సర్కిళ్ల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, వాటి ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు. కాగా, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ర్ట నేతలు సన్మానించారు. బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్.రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ కాల్స్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశీయంగా చేసే ఇంటర్నెట్ కాల్స్‌ను నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే టెలికం శాఖ (డాట్) కమిటీ ఇచ్చిన నివేదికకు సంబంధించి కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన డాట్ కమిటీ.. నెట్ ద్వారా ఉచిత కాల్స్ సదుపాయా న్ని కల్పించే స్కైప్, వాట్సాప్ వంటి యాప్స్‌ను టెలికం ఆపరేటర్లతో సమానంగా నియంత్రణ పరిధిలోకి తేవాలని కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శల నేపథ్యంలో మంత్రి తాజా వివరణ ఇచ్చారు. -
టెల్కో సేవల నాణ్యత పై కేంద్రం దృష్టి
కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి మొబైల్ నెట్‌వర్క్‌ల ఆడిట్ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ : తరచూ కాల్ డ్రాప్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొబైల్ నెట్‌వర్క్‌ల పనితీరును పరీక్షించేందుకు ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నట్లు టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తమ శాఖలో భాగమైన టెలికం ఎన్ఫోర్స్మెంట్, రిసోర్స్ అండ్ మానిటరింగ్ (టెర్మ్) విభాగం ఇది చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. కాల్ డ్రాప్ (అర్ధంతరంగా కాల్ కట్ అయిపోవడం) సమస్యకు మూలకారణాలు, టెల్కోలు పాటిస్తున్న ప్రమాణాలను అధ్యయనం చేసి తగు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఈ ఆడిట్ ఉపయోగపడగలదని చెప్పారు. నగరాల్లో డేటా వినియోగం, స్మార్ట్ఫోన్ల వాడకం గణనీయంగా పెరగడం వల్ల టెలికం నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మరోవైపు, టెల్కోల సేవల నాణ్యతను బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు తగు విధానాన్ని రూపొందించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించినట్లు ఆయన వివరించారు. ‘డిజిటల్ ఇండియా’కు విశేష స్పందన కేంద్ర ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టు పట్ల విశేష స్పందన లభిస్తోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి 75 బిలియన్ డాలర్ల (రూ.4,72,500 కోట్లు) పెట్టుబడులకు హామీ లభించినట్లు తెలిపారు. ఇండోఆఫ్రికా ఐసీటీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశం సాంకేతికంగా పురోగతి సాధించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని రవి శంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు. -
ఎంఎన్‌పీతో టెలికం సర్వీసులు మెరుగు
- టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) వల్ల టెల్కోల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, సర్వీసులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సాధికారత లభించగలదని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పూర్తి స్థాయి ఎంఎన్‌పీని మేలోనే ప్రారంభించాలని ముందుగా భావించినప్పటికీ టెలికం ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు జూలై 3 దాకా పొడిగించాల్సి వచ్చిందని బీఎస్ఎన్ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇకపై మీ మొబైల్ నంబరుకు మీరే యజమాని. మీరెక్కడికెళ్లినా మీ నంబరును మార్చనక్కర్లేదు’ అని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌ను ఉద్దేశించి ఆయన చెప్పారు. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు వీలు కల్పించే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ.. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఒక టెలికం సర్కిల్ పరిధికి మాత్రమే పరిమితమై ఉండేది. ఈ సదుపాయం వల్ల వేరే టెలికం సర్కిల్‌లోకి నంబరు మార్చుకుంటే సదరు సర్కిల్లో రోమింగ్ చార్జీలు భారం ఉండదు. అయితే, టెలికం సర్కిల్ పరిధి వెలుపల మాత్రం రోమింగ్ చార్జీలు వర్తిస్తాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, యూనినార్, టాటా డొకొమో తదితర టెలికం సంస్థలన్నీ ఎంఎన్‌పీని అమల్లోకి తెచ్చాయి. -
మొబైల్ టారిఫ్‌లు పెరగవు..
కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: స్పెక్ట్రం కోసం టెలికం కంపెనీలు భారీగా వెచ్చించాల్సి రావడం వ ల్ల కాల్ చార్జీలు పెరుగుతాయన్న వాదనలను టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. దీని ప్రకారం ఆపరేటర్లపై వార్షికంగా రూ. 5,300 కోట్లు, నిమిషం పాటు ఉండే కాల్‌పై 1.3 పైసల మేర మాత్రమే భారం ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేటర్ల వద్ద స్పెక్ట్రం 20 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. వేలం పారదర్శకంగా జరిగిందని మంత్రి చెప్పారు. 19 రోజుల పాటు సాగిన స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1,09,874.91 కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం పది రోజుల్లోగా ప్రభుత్వానికి రూ. 28,872.7 కోట్ల చెల్లింపులు జరగాల్సివుంటుంది. అయితే, 2014-15 లోటు భర్తీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్చి 31లోగా ఆరు రోజుల్లోనే ఆపరేటర్లు ఈ మొత్తం కట్టేయాలని కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. తక్కువ స్పెక్ట్రం అందుబాటులో ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ వేలానికి ముందు టెలికం శాఖపై విమర్శలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. అయితే, 2100 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 85 మెగాహెట్జ్‌ను విక్రయానికి ఉంచగా 15 మెగాహెట్జ్ ఇంకా మిగిలిపోయిందని చెప్పారు. దీన్ని బట్టి తాము చేసినది సరైనదేనని తేలిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. వేలంలో ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు వెచ్చించి 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రం దక్కించుకుంది. ఇవే బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 29,130 కోట్లకు బిడ్లు వేయగా, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా ప్రవేశిస్తున్న రిలయన్స్ జియో.. 800, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రం కోసం రూ.10,077 కోట్ల మేర బిడ్లు వేయగా, ఆర్‌కామ్ రూ.4,299 కోట్లు వెచ్చిస్తోంది. వేలంలో పాల్గొన్నప్పటికీ టెలినార్ మాత్రం స్పెక్ట్రం దక్కించుకోలేదు. టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్‌సెల్ రూ. 2,250 కోట్ల బిడ్లు వేశాయి. వేలం ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేత.. స్పెక్ట్రం వేలం ఫలితాలను వెల్లడించడంపై విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. ఇకపై చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో ముందుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో.. బిడ్డర్ల నుంచి ముందస్తుగా రూ. 28,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. వేలం నియమ, నిబంధనలను ప్రశ్నిస్తూ టెల్కోలు దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. -
స్పెక్ట్రం @ రూ. 1.10 లక్షల కోట్లు
ముగిసిన వేలం 19 రోజులు, 115 రౌండ్లు బరిలో 8 కంపెనీలు కాల్, డేటా చార్జీలకు రెక్కలు? న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెడుతుందని భావించిన టెలికం స్పెక్టం వేలం ఎట్టకేలకు ముగిసింది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ. 1.10 లక్షల కోట్లు రానున్నాయి. 19 రోజుల పాటు 115 రౌండ్లు సాగిన వేలం బుధవారంతో ముగిసినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బేస్ ధర ప్రకారం రూ. 82,395 కోట్లు రావాల్సి ఉండగా.. వేలంలో నికరంగా రూ. 1,09,847 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు ఆయన వివరించారు. ‘ఇది దేశ చరిత్రలోనే అత్యధికం. 2010లో రూ. 1,06,000 కోట్లు వచ్చినా అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నుంచే రూ. 30,000 కోట్లు వచ్చాయి. ఈసారి మాత్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లేకుండానే లక్ష కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చాయి’ అని మంత్రి పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వుల కారణంగా స్పెక్ట్రం దక్కించుకున్న సంస్థల పేర్లు వెల్లడించలేదు. వేలం మార్గదర్శకాలు, అర్హతా నిబంధనలను ప్రశ్నిస్తూ దాఖలైన వివిధ కేసులపై సుప్రీం కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం నాలుగు బ్యాండ్‌విడ్త్‌లలో అమ్మకానికి ఉంచిన స్పెక్ట్రంలో 11 శాతం మిగిలిపోయింది. రెండు స్పెక్ట్రం బ్యాండ్లకు సంబంధించి కొన్ని సర్కిళ్లలో రెట్టింపు ధరలకు టెల్కోలు బిడ్లు దాఖలు చేశాయి. వేలం ఎందుకంటే.. పలు టెలికం సంస్థలకు వివిధ సర్కిళ్లలో ఉన్న పర్మిట్ల గడువు 2015-16తో ముగియనుంది. ఐడియా సెల్యులార్వి తొమ్మిది, రిలయన్స్ టెలికం.. వొడాఫోన్వి చెరి ఏడు, భారతీ ఎయిర్‌టెల్‌వి ఆరు పర్మిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో స్పెక్ట్రం వేలం నిర్వహించాల్సి వచ్చింది. వీటితో పాటు 2013, 2014 వేలంలో మిగిలిపోయిన స్పెక్ట్రంను కూడా కలిపి కేంద్రం వేలం నిర్వహించింది. 2జీ సేవలకు ఉపయోగపడే 9,00, 1,800 మెగాహెర్ట్జ్, సీడీఎంఏ సేవలకు ఉపయోగించే 800 మెగాహెట్జ్, 3జీ సర్వీసుల కోసం ఉపయోగపడే 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 385.75 మెగాహెర్ట్జ్ మేర స్పెక్ట్రంను 17 సర్కిళ్లలో వేలానికి ఉంచింది. వేలంలో మొత్తం 8 కంపెనీలు బరిలో నిల్చాయి. ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ తమ స్పెక్ట్రం చేజారకుండా చూసుకునేందుకు పోటీపడ్డాయి. రిలయన్స్ జియో, టాటా టెలిసర్వీసెస్, టె లివింగ్స్ (యూనినార్), ఎయిర్‌సెల్ మాత్రం అదనంగా స్పెక్ట్రం దక్కించుకునేందుకు వేలంలో పాల్గొన్నాయి. చెల్లించాల్సిన తీరు ఇదీ .. టెలికం ఆపరేటర్లు వాయిదా చెల్లింపుల పద్ధతినిగానీ ఎంచుకున్న పక్షంలో ముందస్తుగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 2100 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లకయితే బిడ్ మొత్తంలో 33 శాతం, 900..800 మెగాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్కైతే 25 శాతాన్ని వేలం ముగిసిన 10 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని 12 ఏళ్ల వ్యవధిలో చెల్లించాలి. ఇందులో రెండేళ్ల పాటు మారటోరియం వ్యవధి ఉంటుంది. మొత్తం మీద పదేళ్ల పాటు వార్షికంగా వాయిదాలు కట్టాలి. స్పెక్ట్రం పర్మిట్ 20 ఏళ్లు ఉంటుంది. ‘సున్నా నష్టం’ తప్పని తేలింది: జైట్లీ తాజా స్పెక్ట్రం వేలంలో రూ. 1.10 లక్షల కోట్ల మేర బిడ్లు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. 2008లో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వమేమీ నష్టపోలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువైందని ఆయన చెప్పారు. ‘స్పెక్ట్రం విలువ సున్నా అని కొందరికి ఉన్న అభిప్రాయాలను ఈ వేలం పటాపంచలు చేసింది’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు చురకలంటించారు. అత్యంత విలువైన స్పెక్ట్రంను కేటాయించేయడం వల్ల ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తప్పు పట్టడం తెలిసిందే. అయితే, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కాగ్ చేసిన లెక్కలన్నీ తప్పుల తడకలని విమర్శించిన సిబల్, అసలు ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం ‘సున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. దీనిపైనే తాజాగా జైట్లీ వ్యాఖ్యానించారు. రేట్లు పెంచాల్సి రావొచ్చు: సీవోఏఐ స్పెక్ట్రం కోసం టెలికం కంపెనీలు భారీగా కట్టాల్సి రావడం వల్ల టారిఫ్‌లు కూడా పెంచాల్సి రావొచ్చని సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘ఆపరేటర్ల నుంచి గరిష్టంగా రాబట్టే విధంగా వేలం ప్రక్రియ ఉంది. లేకపోతే స్పెక్ట్రం కొరత ఎందుకు సృష్టిస్తారు. దీని వల్ల పోటాపోటీగా బిడ్లు వేసిన ఆపరేటర్లు ఆ భారాన్ని వినియోగదారులకి బదలాయించే అవకాశముంది. ఫలితంగా కాల్, ఎస్ఎంఎస్, డేటా చార్జీలు పెరగవచ్చు’ అని ఆయన తెలిపారు. ఇప్పటికే పెద్ద టెల్కోలు రుణభారంలో ఉన్నాయని, తాజాగా స్పెక్ట్రం ధర మరింత పెరిగినందున రేట్లు పెంచడం మినహా వాటికి మరో మార్గం లేదని టెలికం సేవల సంస్థల అసోసియేషన్ ఏయూఎస్‌పీఐ మాజీ సెక్రటరీ జనరల్ ఎస్సీ ఖన్నా చెప్పారు.