
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబం ధించి అతి త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీనిచ్చారు. హైకోర్టు విభజన వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పూర్తయ్యే అవకాశముందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశా రు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ తదితరు లు గురువారం హైకోర్టు విభజన ఆలస్యం వార్తల నేపథ్యంలో మరోసారి రవిశంకర్‌ను ఢిల్లీలో కలిశా రు. హైకోర్టు విభజనలో ఆలస్యం జరగదని, ఇప్పటికే నోటిఫికేషన్ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు వినోద్‌కుమార్ మీడియాకు తెలిపారు.
అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్‌తో భేటీ..
టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కె.కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణకు వెనుకబడిన జిల్లాల కింద చివరి విడతగా రావాల్సిన నిధులను విడుదల చేయాలని జైట్లీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాసిన లేఖ వివరాలను ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జైట్లీ మూడ్రోజుల్లో నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన ట్టు ఎంపీలు తెలిపారు. అలాగే తెలంగాణలో పెండిం గ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేం దుకు అవసరమైన నిధుల విడుదల, కొన్ని స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడంపై పీయూష్ గోయల్‌తో ఎంపీలు చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కోరా రు. సమావేశం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆ ర్‌ఎస్ విజయం సాధించడంపై ఎంపీలకు పియూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment