ఇంటర్నెట్ కాల్స్ కు కళ్లెం వేయండి
డాట్‌కు టెలికం కంపెనీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: యాప్స్ ద్వా రా చేసే కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)ను నిలిపివేయాలని మొబైల్ ఆపరేటర్స్ సమాఖ్య సీఓఏఐ పేర్కొంది. సీఓఏఐ తాజాగా టెలికం కార్యద ర్శి జేఎస్ దీపక్‌కు ఒక లేఖ రాసింది. ఇందులో మొబైల్/ల్యాండ్‌లైన్ ఫోన్లకు కేటాయించిన నెంబర్ల ద్వారా నెట్‌వర్క్ సాయంతో ఇంటర్నెట్ కాల్స్ చేయడమనేది ప్రస్తుత ఇంటర్‌కనెక్షన్ నియమాలకు విరుద్ధమని, ఇలాంటి చర్యల వల్ల టెలికం కంపెనీలకు నష్టం కలుగుతోందని వివరించింది. ‘ఇంటర్‌నెట్ టెలిఫోనీ’, మొబైల్ ఫిక్స్‌డ్ లైన్ సర్వీసులనేవి వేరు వేరు అంశాలని తెలిపింది. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇటీవల ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్సీ సర్వీసును ప్రారంభించింది. దీనిపై సీఓఏఐ టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడంతో బీఎస్‌ఎన్‌ఎల్ తన సర్వీసును ప్రస్తుతానికి నిలిపివేసింది.