Mobile operators
-
4జీ వేగంతో 5జీ దిశగా.. దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేటు రంగ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఆకర్షణీయమైన రీచార్జి ప్యాకేజీలకు తోడు, మెరుగైన సర్వీసులు అందిస్తుండటంతో వినియోగదారులు క్రమేపీ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుతున్నారు. బీఎస్ఎన్ఎల్ దేశీంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలను రాష్ట్రంలోకి అందుబాటులోకి తెస్తుండటంతో వినియోగదారులకు హైస్పీడ్ డేటాతో పాటు అంతరాయాలు లేకుండా కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు కలుగుతోంది. దీంతో ఇతర ప్రైవేటు మొబైల్ ఆపరేటర్ల నుంచి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపునకు మారుతున్నారు.తక్కువ టారిఫ్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడలో 4జీ సేవలను అందుబాటులోకి రావడంతో గడిచిన 20 రోజుల్లోనే 600 మందికి పైగా ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి మారినట్లు విజయవాడ బీఎస్ఎన్ఎల్ జీఎం రమణ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో రూ.229 రీచార్జికి 30 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంటే.. ఇవే ప్రయోజనాలు పొందాలంటే ప్రైవేటు సంస్థల్లో రూ.349 నుంచి రూ.379 వరకు చెల్లించాల్సి వస్తోంది.తక్కువ రేటుకే బీఎస్ఎన్ఎల్ మొబైల్ సరీ్వసులు అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ డేటా వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి మొబైల్ వినియోగదారుడు సగటున 24 జీబీ డేటాను వినియోగిస్తుంటే.. రాష్ట్రంలో గ్రామీణ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు మాత్రం 70 జీబీ పైనే వినియోగిస్తుండటం గమనార్హం.త్వరలో 5జీ సేవలు రాష్ట్రంలోని 4,500 ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. ఒక్కసారి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఆరు నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 5జీ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య 1.50 లక్షలు దాటగా, మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 50 లక్షలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏడీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్ 25,000, ఫైబర్ టు హోమ్ కనెక్షన్ల సంఖ్య 1.9 లక్షలకు పైనే ఉన్నాయి. రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 2022–23లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.700 కోట్లకు చేరుకోగా.. అది 2023–24లో రూ.1,000 కోట్ల మార్కుకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు మిగులు స్థలాలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల బీఎస్ఎన్ఎల్కు ఉన్న అదనపు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడ, తాడేపల్లిగూడెం, తుని, పాలకొల్లు, కొండపల్లిలో స్థలాలను విక్రయించడం ద్వారా రూ.80 కోట్ల నిధులను సమకూర్చుకుంది.1.5లక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య రూ.700కోట్లు 2022–23లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం50లక్షలు రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య రూ.1,000కోట్లు 2023–24లో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం(అంచనా) -
117 కోట్లకు టెలికం చందాదారులు
న్యూఢిల్లీ: దేశంలో టెలికం చందారుల సంఖ్య గతేడాది ముగింపునకు 117 కోట్లు దాటింది. కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే 2022 డిసెంబర్ నెలలోనూ రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మంచి పనితీరును చూపించాయి. రిలయన్స్ జియో 17 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించగా, భారతీ ఎయిర్టెల్ 15.2 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఇక మరో ప్రైవేటు టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) 24.7 లక్షల కస్టమర్లను డిసెంబర్ నెలలో నష్టపోయింది. మొబైల్ చందాదారుల సంఖ్య 2022 నవంబర్ నాటికి 1,143.04 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,142.93 మిలియన్లకు తగ్గింది. వైర్‌లైన్ సబ్‌్రస్కయిబర్లు డిసెంబర్ చివరికి 2.74 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ విభాగంలో రిలయన్స్ జియో 2,92,411 మంది కొత్త కస్టమర్లు సంపాదించింది. భారతీ ఎయిర్టెల్ 1,46,643 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ ఎంటీఎన్ఎల్ 1.10 లక్షల మంది వైర్‌లైన్ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోయింది. టెలికం సేవల్లో ఇప్పటికీ సమస్యలే.. లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి దేశంలో టెలికం వినియోగదారులు నేటికీ సేవలు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాల్స్డ్రాప్, కాల్ కనెక్టింగ్ సమస్యలు వారిని వేధిస్తున్నాయి. లోకల్‌సర్కిల్స్ ఇందుకు సంబంధించి చేసిన ఆన్లైన్ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 28 శాతం మంది కస్టమర్లు తాము ఎలాంటి అవాంతరాల్లేని 4జీ, 5జీ సేవలు ఆనందిస్తున్నట్టు చెప్పగా.. 32 శాతం మంది తాము డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ అన్ని వేళల్లోనూ అంతరాయాల్లేని సేవలను పొందలేకపోతున్నట్టు తెలిపారు. 69 శాతం మంది తాము కాల్ కనెక్షన్/కాల్ డ్రాప్ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 42,000 మంది నుంచి ఈ అభిప్రాయాలను లోకల్‌సర్కిల్స్ తెలుసుకుంది. కాల్ కనెక్షన్, కాల్ డ్రాప్‌పై సంధించిన ప్రశ్నకు 10,927 మంది స్పందించారు. వీరిలో 26 శాతం మంది తాము నివసించే ప్రాంతంలో ఎయిర్టెల్, జియో, వొడాఐడియా సేవలు మంచి కవరేజీతో ఉన్నట్టు చెప్పగా.. 51 శాతం మంది కవరేజీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. -
టెలికం కంపెనీలకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ టెలికం కంపెనీలకు భారీ షాక్ తగిలింది. చార్జీల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నిర్దేశించిన అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ( ఏజీఆర్\) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీం గురువారం తీర్పుచెప్పింది. దీనికి డాట్ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పింది. టెల్కోలు లేవనెత్తిన అంశాలను పనికిరానివని కొట్టిపారేయడమే కాకుండా.. వడ్డీ తో సహా జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఏఏ నజీర్, ఎంఆర్‌షాలతోకూడిన సుప్రీం ధర్మాసంన ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఏజీఆర్ ఫీజుపై మొబైల్ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14 సంవత్సరాల న్యాయ పోరాటం ముగిసింది. అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, అందులో సగానికి పైగా ఎయిర్టెల్, వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది. డాట్ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ .21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .28,309 కోట్లు, ఎమ్టీఎన్ఎల్ రూ.2 వేల 537 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. డాట్ రూల్స్ ప్రకారం అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లో ఎనిమిది శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఏజీఆర్ స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్సింగ్ ఫీజులుగా విభజించారు. ఐదుశాతం ఎస్‌యూసీతోపాట, ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన మొబైల్ సంస్థ ఓటీఎస్‌సీ కూడా చెల్లించాలి. ఒక్కో సర్కిల్ లో 4.4 మెగాహెజ్ ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్ ధరలు చెల్లించాల్సిందే! మరోవైపు ఈ తీర్పుతో భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ షేర్లు 4.9 శాతం, వోడాఫోన్ ఐడియా 13.3 శాతం పతనాన్ని నమోదు చేసాయి. -
ఆధార్ డెడ్‌లైన్ పెంచండి
న్యూఢిల్లీ: దరఖాస్తుదారుల ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను అమలు చేసేందుకు మరింత సమయం కావాలని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ (యూఐడీఏఐ)ని మొబైల్ ఆపరేటర్లు కోరారు. ఇందుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లు తయారు చేసే సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫేస్ ఆథెంటికేషన్ అమలుకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 15తో ముగిసిపోనున్న నేపథ్యంలో యూఐడీఏఐకి ఆపరేటర్ల ఫోరం (యాక్ట్) ఒక లేఖ రాసింది. దీన్ని అమలు చేయాలంటే డివైజ్ వ్యవస్థ అంతా సిద్ధమయ్యాక కనీసం రెండు నెలల వ్యవధి అయినా ఉండాలని, అప్పటిదాకా పెనాల్టీలు విధించరాదని కోరింది. ఈకేవైసీ ఆథెంటికేషన్ పూర్తయ్యాక.. దరఖాస్తుదారు ఫోటో తీసుకోవడం, యూఐడీఏఐ డేటాబేస్‌లో వారి ఫోటోతో సరిపోల్చి చూసుకోవడం వంటి నిబంధనలు .. ఎలాంటి అదనపు ప్రయోజనం లేకుండా ఒకే పనిని పది సార్లు చేసినట్లవుతుందని పేర్కొంది. -
ఇంటర్నెట్ కాల్స్ కు కళ్లెం వేయండి
డాట్‌కు టెలికం కంపెనీల విజ్ఞప్తి న్యూఢిల్లీ: యాప్స్ ద్వా రా చేసే కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)ను నిలిపివేయాలని మొబైల్ ఆపరేటర్స్ సమాఖ్య సీఓఏఐ పేర్కొంది. సీఓఏఐ తాజాగా టెలికం కార్యద ర్శి జేఎస్ దీపక్‌కు ఒక లేఖ రాసింది. ఇందులో మొబైల్/ల్యాండ్‌లైన్ ఫోన్లకు కేటాయించిన నెంబర్ల ద్వారా నెట్వర్క్ సాయంతో ఇంటర్నెట్ కాల్స్ చేయడమనేది ప్రస్తుత ఇంటర్కనెక్షన్ నియమాలకు విరుద్ధమని, ఇలాంటి చర్యల వల్ల టెలికం కంపెనీలకు నష్టం కలుగుతోందని వివరించింది. ‘ఇంటర్నెట్ టెలిఫోనీ’, మొబైల్ ఫిక్స్డ్ లైన్ సర్వీసులనేవి వేరు వేరు అంశాలని తెలిపింది. కాగా బీఎస్ఎన్ఎల్ కూడా ఇటీవల ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్సీ సర్వీసును ప్రారంభించింది. దీనిపై సీఓఏఐ టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడంతో బీఎస్ఎన్ఎల్ తన సర్వీసును ప్రస్తుతానికి నిలిపివేసింది. -
ఇలా అయితే రేట్లు పెంచేస్తాం..
కాల్ డ్రాప్ పెనాల్టీలపై ట్రాయ్‌కు టెల్కోల లేఖ న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ అయితే మొబైల్ ఆపరేటర్లు కస్టమర్లకు పరిహారం చెల్లించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలకు వ్యతిరేకంగా టెల్కోలు గళమెత్తాయి. కాల్స్‌కి అంతరాయాలే ఉండని నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం సాధ్యంకాదని స్పష్టం చేశాయి. బలవంతంగా జరిమానాలు కట్టిస్తే.. తాము మొబైల్ టారిఫ్‌లు పెంచేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. టెలికం కంపెనీల సమాఖ్యలు సీవోఏఐ, ఏయూఎస్‌పీఐ ఈ మేరకు ట్రాయ్‌కు సంయుక్తంగా లేఖ రాశాయి. పెనాల్టీల విధానం వల్ల కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం కాకపోగా.. పరిహారం లభిస్తుందనే ఆశతో కస్టమర్లు కావాలనే కాల్స్‌కి అంతరాయాలూ కలిగేలా వ్యవహరించే అవకాశం ఉందని అవి పేర్కొన్నాయి. దీనివల్ల కాల్ డ్రాప్స్ ఇంకా పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. యూజరుకు కట్టిన పరిహారాలను రాబట్టుకునేందుకు ఆపరేటర్లు టారిఫ్‌లను పెంచాల్సి వస్తుందని, అంతిమంగా కస్టమర్లు టెలికం సర్వీసులు పొందాలంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని టెల్కోలు పేర్కొన్నాయి. జరిమానాల విధానం.. అపరిమిత దుర్వినియోగానికి తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని తెలిపాయి. సగటున యూజర్ నుంచి తమకు వచ్చే ఆదాయమే రూ. 125 కాగా, పరిహారం కింద నెలకు రూ. 90 కట్టాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది పరిశ్రమను కలవరపరుస్తోందని టెలికం సంస్థలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి కాల్ డ్రాప్ అయిన పక్షంలో కస్టమర్లకు టెల్కోలు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజుకు గరిష్టంగా మూడు కాల్స్‌కు, పెనాల్టీని రూ. 3కి పరిమితి విధించింది. -
3జీ స్పెక్ట్రం... బేస్ ధర రూ. 2,720 కోట్లు
కేంద్రానికి ట్రాయ్ సిఫార్సులు న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా దేశవ్యాప్త 3జీ స్పెక్ట్రం వేలం ధరను ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని టెలికం విభాగానికి (డాట్) సిఫార్సు చేసింది. 2010లో మొబైల్ ఆపరేటర్లు చెల్లించిన మొత్తానికన్నా ఇది 19 శాతం తక్కువ. అయితే, క్రితం 3జీ వేలం రిజర్వ్ ధరతో పోలిస్తే మాత్రం నాలుగు రెట్లు అధికం. మరోవైపు, 1900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రంకి బదులుగా రక్షణ శాఖ నుంచి అదనంగా లభించబోయే 15 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కూడా వేలం వేయాల్సిందిగా ట్రాయ్ సూచించింది. రక్షణ శాఖతో సూత్రప్రాయ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇది తక్షణమే చేతికి రాకపోయినప్పటికీ వేలం వేసేయొచ్చని పేర్కొంది. ప్రతి లెసైన్సు సర్వీస్ ఏరియాలో (ఎల్ఎస్ఏ) 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ (3జీ) స్పెక్ట్రం బేస్ ధర రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని పేర్కొంది. ఎల్ఎస్ఏలో 3-4 బ్లాకులు ఉన్న పక్షంలో ఏ బిడ్డరు కూడా 2 బ్లాకులకు మించి బిడ్డింగ్ వేయకుండా పరిమితి విధించాలని తెలిపింది. వేలంలో విజేతలుగా నిల్చిన టెలికం ఆపరేటర్లు ..స్పెక్ట్రం కేటాయింపులు జరిపినప్పట్నుంచీ మూడేళ్లలోగా నెట్‌వర్క్‌ను సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. గతంలో ఇది అయిదేళ్లుగా ఉండేది. అటు ఎస్-టెల్కు మూడు సర్వీస్ ఏరియాల్లో (బీహార్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్) కేటాయించిన స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ట్రాయ్ సూచించింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టు 122 లెసైన్సులు రద్దు చేయడంతో ఎస్టెల్ భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిలిపివేసింది. 800,900, 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో ఫిబ్రవరిలో స్పెక్ట్రం వేలం జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రం కూడా వేలం వేయాలని డాట్ యోచిస్తోంది. ట్రాయ్ సిఫార్సులను డాట్.. టెలికం కమిషన్‌కు సమర్పిస్తుంది. అది.. టెలికం శాఖకు అభిప్రాయం తెలియజేస్తుంది. మరోవైపు, ట్రాయ్ సిఫార్సులు సరైన దిశలో ఉన్నాయని టెలికం సంస్థ యూనినార్ అభిప్రాయపడింది.