న్యూఢిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, మెసేజీల సర్వీసులను అందించే సంస్థలు కూడా ఇకపై ఆ వివరాలను రెండేళ్ల పాటు తప్పనిసరిగా నిల్వ చేయాల్సి రానుంది. టెలికం శాఖ ఈ మేరకు సర్క్యులర్‌లను జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే వీటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
నిల్వ చేయాల్సిన కాల్ డేటా రికార్డుల పరిధిని ఇంటర్నెట్ కాల్స్‌కు కూడా పెంచుతూ ఏకీకృత లైసెన్సు(యూఎల్) నిబంధనలకు టెలికం శాఖ డిసెంబర్‌లో సవరణలు చేసింది. దీనికి కొనసాగింపుగా టెల్కోలతో పాటు వాయిస్ మెయిల్, ఆడియోటెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీస్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా వర్తించేలా తాజా నిబంధనలతో జనవరి 27న టెలికం విభాగం సర్క్యులర్‌లు జారీ చేసింది.
శాటిలైట్ ఫోన్ సేవలు, డేటా సర్వీసులు అందించేందుకు లైసెన్సు పొందిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు కూడా ఇదే తరహా సవరణను వర్తింపచేస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ తరహా లైసెన్సులు తీసుకున్న టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఏటీఅండ్‌టీ గ్లోబల్ నెట్‌వర్క్ మొదలైన వాటికి ఈ సవరణలు వర్తించనున్నాయి. శాటిలైట్ ఫోన్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించే భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి కంపెనీలను ఏకీకృత లైసెన్స్ హోల్డర్లుగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment